ఆ కారణాలతో ఆగి పోయినా సూపర్ స్టార్ మూవీస్....!!

murali krishna
తెలుగు ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ కృష్ణకు స్పెషల్ ప్లేస్ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్ గా పేరు సంపాదించినా సూపర్ స్టార్ కృష్ణ యాభై వయసులో కూడా తన నటజీవితంలో మూడు వందల కి పైగా సినిమాల్లో  నటించాడు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అవుతూ డిఫరెంట్ మరియు, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మరియు నిర్మిస్తూ తెలుగు పరిశ్రమలో న్యూ టెక్నాలజీ తెచ్చి,మార్గదర్శకంగా నిలిచాడు.
ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తనకి ఇవ్వవలసిన రెమ్యునరేషన్ కంప్లీటెగా  ఇవ్వకపోయినా సరే, మూవీ విడుదల ఐతే  చాలనుకునేవారు. అలాగే ప్రొడ్యూసర్ కి లాస్ వస్తే తనకి లాస్ వచ్చిందని బాధపడేవారు.అలాగే  నిర్మాతల ప్రణాళిక లోపం వలన కృష్ణ మూవీస్ కొన్ని ఆగిపోయాయి. దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి ,కృష్ణ కాంబో లో వచ్చిన పసిడి పంటలు సినిమా భానుప్రియ హీరోయిన్ గా మొదలైంది. సత్యనారాయణ వంటి నటులు నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి, మొదటి కాపీ వచ్చాక ,ప్రొడ్యూసర్స్ లో ఒకరు చనిపోవడంతో మువీ విడుదల ఆగింది.
ఐనా తర్వాత ఆ మూవీ విడుదల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వ్ంలో కృష్ణ హీరోగా ప్రతాప రుద్రుడు సినిమా మొదలైంది. వెంకటేశ్వర రెడ్డి కొత్త ప్రొడ్యూసర్ గా పరిచయం అయ్యాడు. ఆ మూవీ లో రాధ హీరోయిన్. ఆ మూవీ కూడా రెండు షెడ్యూల్ అయ్యాక ఆర్ధిక పరిస్థితి తో ఆగిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్  శివనాగేశ్వరరావు గారు కృష్ణతో అదరహో సినిమా స్టార్ట్ చేసారు అందులో రంభ హీరోయిన్ గా చేసింది అది కూడా రెండు సాంగ్స్ మినహా సినిమా కంప్లీట్ అయ్యింది.
ఆ టైం లోనే సంప్రదాయం సినిమా మొదలవ్వడం అది విడుదల అయ్యి నెగటివ్ టాక్ తెచ్చిపెట్టడంతో దాని ఎఫెక్ట్ అదరహో సినిమా మీద పడింది. దాంతో సినిమా షూటింగ్ ముందుకి సాగలేదు.అలాగే
వారెవ్వా మొగుడా అనే సినిమాలో కృష్ణ వైఫ్ గా  వినీత, మరదలిగా రుచిత నటించారు.ఆ మూవీ లో ఒక సాంగ్ మినహా మొత్తం కంప్లీట్ ఐనప్పటికి  కొత్త ప్రొడ్యూసర్స్ కావడంతో చేతులెత్తేశారు. ఇక పూరి జగన్నాధ్ తిల్లానా అనే సినిమా ని కృష్ణతో స్టార్ట్ చేసారు.ఇది కూడా మూడు సాంగ్స్, కొద్దిగా షూటింగ్ జరిగినా నిర్మాత ఆర్ధిక ఇబ్బందులతో మూవీ ఆగిపోయింది. బొబ్బిలి దొర సినిమా విడుదల కాకుండానే ఎమ్మెల్యే అనే సినిమాకి బోయపాటి కామేశ్వరరావుకి కృష్ణ అవకాశం ఇచ్చారు. ఐతే షూటింగ్ జరుగుతుండగా బొబ్బిలిదొర సినిమా ప్లాప్ అవ్వడంతో ప్రొడ్యూసర్ కు టెన్షన్ వేసి తన సినిమా కూడా ఆపి వేసాడు.
ఈ విధంగా కృష్ణ గారి చాలా సినిమాలు అనేక కారణాల వల్ల ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: