ఆర్.ఆర్.ఆర్ కు ఆస్కార్ దక్కుతుందా...?

murali krishna
ఎంతో మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ ని రేపే ప్రకటించబోతున్నారని తెలుస్తుంది...మన తెలుగు ఆడియన్స్ ఈ అవార్డ్స్ కోసం ఎప్పుడూ కూడా ఇంతలా అయితే ఎదురు చూసింది  లేదు..ఇప్పుడు అంత ఆతృతగా ఎదురు చూడడానికి కారణం #RRR..దర్శక ధీరుడు అయిన రాజమౌళి తెరకెక్కించిన ఈ వెండితెర దృశ్యకావ్యం ని విదేశీయులు కూడా బాగా ఇష్టపడ్డారు..ప్రముఖ హాలీవుడ్ దర్శకులు స్పెల్ బర్గ్ మరియు జేమ్స్ కెమరూన్ వంటి దర్శకులు కూడా ఈ చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడ్డారంటేనే అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా #RRR సృష్టించిన ప్రభంజనం సృష్టించింది.ఇప్పటికే 'గోల్డెన్ గ్లోబ్' మరియు 'లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్' వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్స్ ని అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్స్ ని కూడా అందుకుంటుందని కూడా అంటున్నారు విశ్లేషకులు..ప్రస్తుతానికి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో ఏయే క్యాటగిరీలలో #RRR కి ఆస్కార్ అవార్డ్స్ దక్కే అవకాశం ఉందో తెలుసుకుందాం.

ఇది వరకే #RRR కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మరియు ఉత్తమ ఫారిన్ చిత్రం క్యాటగిరీస్ లో అవార్డ్స్ కూడా దక్కాయి..ఆస్కార్ కి కూడా ఈ క్యాటగిరీలలోనే నామినేషన్స్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా చెప్తున్నారు..ముఖ్యంగా 'నాటు నాటు' సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నామినేషన్స్ దక్కడం దాదాపుగా ఖరారు అయ్యినట్టే అని కూడా అంటున్నారు..మరోపక్క ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరో కి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు దక్కే అవకాశం అయితే ఉందని ఆశగా ఎదురు చూస్తున్నారు.

కానీ వాళ్లకి నామినేషన్స్ లో చోటు దక్కడం అసాధ్యం అనే చెప్పవచ్చు...బెస్ట్ మోషన్ పిక్చర్ క్యాటగిరి లో కూడా ఈ సినిమాకి నామినేషన్ దక్కే అవకాశం ఉందంటున్నారటా..మరి రేపు అస్సలు ఏమి జరగబోతుందో అనేది..కేవలం #RRR మూవీ టీం మాత్రమే కాదు, యావత్తు భారతదేశం అంతా రేపు #RRR కి ఒస్కార్స్ లో నామినేషన్ దక్కుతుందా లేదా అని ఆతృతగా అయితే ఎదురు చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: