ఆ సినిమా కోసం ఆర్జివి అన్ని అబద్దాలు చెప్పాడా....?

murali krishna
ఆర్జీవీ ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా దర్శకుడిగా  ఆయన చేయని పని లేదు, చెప్పని అబద్ధము కూడా లేదు. శివ సినిమా మొదటిగా తీయడానికి ముందు ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు అయితే జరిగాయి

అమీర్ పేట ఆడియో క్యాసెట్ షాప్ నడిపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అరెస్టయి ఒక రాత్రంతా ఉండి బయటకు వచ్చాక మళ్లీ సినిమా పిచ్చి పట్టుకొని తండ్రి చెప్పిన ఒక మాటతో తన ప్రయాణం కొనసాగించాడటా ఆర్జీవీ . 

అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ గారు కొత్త అసిస్టెంట్ దర్శకుల కోసం చూస్తున్నారు అని తన తండ్రి ఒక మాట చెప్తే ఆ మాట పట్టుకుని వెంకట్ గారి కోసం అపాయింట్మెంట్ సంపాదించాడటా..అయితే అక్కినేని వెంకట్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని ఆ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ ని చూస్తున్నారట. అయితే వర్మ అప్పటికే రాసుకున్న ఒక కథను వెంకట్ కి వినిపించినట్లు తెలుస్తుంది 

అది అస్సలు బాగోలేదని ఆయన రిజెక్ట్ చేయగా అప్పటికప్పుడే తన కాలేజీలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను, తన జీవితంలో జరిగిన విషయాలను జోడించి శివ కథను కూడా చెప్పాడట. రాఘవేంద్రరావు దగ్గరికి శివ కథ పట్టుకుని వర్మను తీసుకొని వెంకట్ వెల్లగా ఈ సినిమా వర్కౌట్ కాదని కూడా ఆయన చెప్పారట. అయితే మళ్లీ అప్పటికప్పుడు ఆయన కలియుగ పాండవులు సినిమా చూసి తన కథకు మెరుగులు దిద్దుకొని నాగార్జున కోసం ఆ కథను వినిపించారట. అయితే ఆ కథ కాస్త నచ్చి నాగార్జున చుట్టూ చేరడం, అలాగే సినిమా స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు పక్కన పెట్టి అనవసరపు పనులు చేయడం  క్లాప్ బోర్డులు పోగొట్టడం అలాగే కథ కంటిన్యూటీ ఫైల్స్ మిస్ చేయడం లాంటివి చేసేవాడని సమాచారం.దాంతో నాగార్జున తొత్తుగా పనికిరాని వ్యక్తిగా అందరూ కూడా అతనిని చూసేవారట. అయినా కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి నాగార్జున చేత శివ సినిమా తీపించి హిట్టు కొట్టాడటా ఆర్జీవీ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: