పఠాన్: విడుదలకు ముందే సేఫ్ జోన్?

Purushottham Vinay
బాలీవుడ్ ఫేమస్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపిక పదుకొనే, జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన సినిమా పఠాన్.ఈ సినిమాను ఈనెల 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆదిత్య చోప్రా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా బిజినెస్ పరంగాను ఇంకా అలాగే బజ్‌ పరంగాను వేరే లెవెల్ లో ఉంది.షారుక్ ఖాన్ ఇప్పటిదాకా ఆయన కెరీర్ లో చూడనంతగా వీకెండ్ కలెక్షన్లను ఈ మూవీ రాబడుతుందని బిజినెస్ వర్గాల అంచనా. పఠాన్ మూవీ ప్రీ బుకింగ్ కూడా మొదలైంది. ప్రీ సేల్స్ చాలా ఎక్కువగా అసలు ఎవరు ఊహించని రేంజ్ లో ఉందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు.గతంలో షారుక్ ఖాన్ సినిమాలు అన్నిటికన్నా కూడా డే వన్ కలెక్షన్లు పఠాన్‌ సినిమాకి చాలా ఎక్కువగా ఉంటాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బేషరం పాట విడుదలైన క్షణం నుంచే పఠాన్ సినిమా మీద నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ మొదలయ్యాయి.


అప్పటి నుంచే  ఎప్పుడు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయా అనే ఎదురుచూపులు అభిమానుల్లోనూ ఇంకా అలాగే సినీ పండితుల్లోను కనిపించాయి. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్న తీరు చూస్తే ఇండియాలోనే ఇప్పటిదాకా ఏకంగా మూడున్నర లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.అయితే ఈ టిక్కెట్ల సంఖ్య కూడా కేవలం కొన్ని మల్టీప్లెక్స్ లకు సంబంధించినది మాత్రమే. వీటన్నిటిని బట్టి చూస్తే పఠాన్ తొలి వారాంతంలో ఏకంగా 150 నుంచి 200 కోట్లు ఈజీగా రాబడుతుందని అంచనా. ఐదు రోజుల వీకెండ్ లో పూర్తయ్యేసరికి పఠాన్ కలెక్షన్లు  ఏకంగా 300 కోట్లను దాటే సూచనలు కూడా కనిపిస్తున్నాయని సమాచారం తెలుస్తుంది. పఠాన్ హిందీ మూవీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా అదే రోజు విడుదల కానుంది.గత నాలుగేళ్లుగా సరైన రిలీజ్ లేని షారుక్ ఖాన్ కి బెస్ట్ సినిమాగా ఈ చిత్రం మారనుందంటున్నారు అభిమానులు. 2023 బాలీవుడ్ కలెక్షన్లకు తెరతీయనుంది పఠాన్. అందుకే సౌత్ తో పాటు నార్త్ లోను ఈ సినిమా కలెక్షన్ల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: