హంట్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చిన దర్శకుడు..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో మూవీలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి సుదీర్ బాబు తాజాగా హంట్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి మహేష్ సురపనేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను జనవరి 26 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ దర్శకుడు మహేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా హంట్ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ ... ఓ యాక్సిడెంట్ లో గతం మరిచిపోయిన పోలీస్ ఆఫీసర్ తనను తాను తెలుసుకుంటూ జీవితంలో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ తాలూకు మిస్టరీ ని ఎలా చేదించాడు అనేదే హంట్ సినిమా. అన్ని గుర్తుండి సాల్వ్ చేయడం ఒక పద్ధతి ... ఏమీ తెలియనివాడు ఎలా సాల్వ్ చేశాడు అనేది మిస్టరీ. హీరోకి మెమొరీ లాస్ అనేది కొన్ని సినిమాల్లో చూశారు. గతం మర్చిపోవడానికి ముందు వెనక ఏం జరిగింది అనేది డ్రామా. మా హంట్ సినిమాలో ఆ డ్రామా కంప్లీట్ గా డిఫరెంట్ గాను మరియు చాలా కొత్తగాను ఉంటుంది అని మహేష్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే హంట్ మూవీ ఏ రేంజ్, విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో తెలియాలి అంటే జనవరి 26 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: