కేవలం అభిమానుల కోసమే అలాంటి పని చేస్తున్న అంటున్న రకుల్ ప్రీత్ సింగ్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే గతంలో ఈమె కొండపొలం సినిమా తర్వాత మరే తెలుగు సినిమాలలో కూడా నటించలేదు ఈమె. ప్రస్తుతం ఈమె హిందీ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇటీవల ఈమె నటించిన ఛత్రివాలి సినిమాతో మంచి గుర్తింపు పొందింది పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగానే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి 

సంబంధించిన అనేక విషయాలని కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇందులో భాగంగానే ఆ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాన్ని తాను ఏ రోజు సీరియస్గా తీసుకోలేదు అని.. కేవలం అభిమానులకు తన సినిమాల సమాచారాన్ని తన సోషల్ మీడియా ద్వారా ఇస్తాను అని.. వాటితో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఇతను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటాను అని.. ఈ రెండు విషయాలకే తను సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఉంటాను అంటూ స్పష్టం చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

అంతేకాదు సోషల్ మీడియాలో పాజిటివ్ తో పాటు నెగటివ్ అంశాలు కూడా ఉంటాయి.. కానీ నేను మాత్రం వాటి గురించి ఎప్పుడో పెద్దగా పట్టించుకోను..ఆలోచించను కూడా సాధారణంగా నా అభిమానులు నా గురించి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి నా సోషల్ మీడియాని చూస్తూ ఉంటారు అని ..అందుకోసం మాత్రమే నేను సోషల్ మీడియాని ఉపయోగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పాన్ ఇండియా సినిమా అయిన ఇండియన్ టూ సినిమాలో కమలహాసన్ సరసన నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. వాటితో పాటు మరో రెండు హిందీ సినిమాలలో సైతం రకుల్ ప్రీత్ సింగ్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: