రష్మికను ఏకీపారేస్తున్న నెటిజన్స్.. కారణం..?

Divya
కన్నడ సినీ పరిశ్రమలో కేజిఎఫ్ , కాంతారా సినిమాలు ఏ రేంజ్ లో ప్రభంజనం సృష్టించాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సినిమాలు సంచలన విజయాలను అందుకోవడమే కాకుండా అందరి దృష్టి తమ వైపు తిప్పుకున్నాయి ముఖ్యంగా కాంతారా సినిమా అయితే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి పెద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా బాహుబలి లాంటి సినిమాల రికార్డులను కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేసింది. ఇకపోతే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సప్తమి గౌడ కి ఆఫర్లు బాగా క్యూ కడుతున్నాయి. తాజాగా వాక్సిన్ వార్ అనే సినిమాతో బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ది కాశ్మీర్ ఫైల్స్  దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. ఇకపోతే సప్తమి గౌడ కంటే ముందే బాలీవుడ్లోకి రష్మిక ఎంట్రీ ఇచ్చింది.  అయితే రష్మిక కన్నడ సినిమాలను ఎప్పుడో వదిలేసిందని చెప్పవచ్చు.  అందుకే కాంతారా  బ్యూటీ సప్తమి గౌడని చూసి నేర్చుకో అంటూ రష్మికపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు కన్నడ సినీ అభిమానులు. అంతేకాదు నిన్నటికి నిన్న సప్తమి గౌడ కూడా.." నాకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా కూడా మొదటి పాధాన్యత కన్నడ ఇండస్ట్రీ కే ఇస్తానని.." చెప్పడంతో ఇప్పుడు రష్మికపై ట్రోలింగ్ మరింత తీవ్రంగా జరుగుతోంది అని చెప్పవచ్చు.
ఇకపోతే తనమీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుండడంతో రష్మిక దిగి వచ్చి కన్నడ సినిమాలలో కూడా నటిస్తాను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను ఈ స్థాయిలో వున్నాను అంటే అందుకు కారణం కన్నడ సినీ పరిశ్రమ అని .. ముఖ్యంగా రక్షిత్ శెట్టి అలాగే రిషబ్ శెట్టి ఒకప్పుడు తనను ఎంతో ప్రోత్సహించారు.. అండగా నిలబడ్డారు అని చెప్పుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే చాలా కాలం తర్వాత ఉన్నట్టుండి ఈ ప్రేమను ఆమె ఎక్కడి నుంచి వలకబోస్తోంది అంటూ కూడా అక్కడి నెటిజన్ లు ఏకి పారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: