కోలీవుడ్ లో సత్తా చాటునున్న సునీల్.. వరుస ఆఫర్లతో..!

Divya
ప్రముఖ హాస్యనటుడు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట్లో హాస్యనటుడిగా పలు చిత్రాలలో నటించి నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకున్నాడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. దాదాపు పదుల సంఖ్యలో సినిమాలలో హీరోగా నటించిన ఈయన తన సిక్స్ ప్యాక్ తో ఎంతోమంది యువతను ఆకట్టుకున్నారు. ఇప్పుడు విలన్ గా కూడా అవతారం ఎత్తి తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు.
కలర్ ఫోటో సినిమాలో ఎవరు ఊహించని విధంగా విలన్ క్యారెక్టర్ చేసి మెప్పించిన సునీల్.. ఆ తర్వాత కూడా ఎక్కువగా విలన్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు.  ఈ క్రమంలోనే 2021లో సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్,  రష్మిక మందన్న హీరో హీరోయిన్లు తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమాలో కూడా మంగళం శీను క్యారెక్టర్ లో నటించి తన విలనిజంతో అందరినీ ఆకట్టుకున్నాడు.  అంతేకాదు తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప పార్ట్ 2 సినిమాల్లో కూడా ఆయన మరింత సీరియస్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సునీల్.  అంతే కాదు ఈ సినిమా కోసం ఏకంగా 2 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారని కూడా భోగట్టా.. ఇప్పుడు ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు కాలేదు అప్పుడే మరొక సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నారు సునీల్. శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న మావీరన్ చిత్రానికి కూడా విలన్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.  ఏది ఏమైనా తెలుగులో కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్న సునీల్ .. కోలీవుడ్లో విలన్ గా మరింత గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: