బాలయ్య సినిమాలో మెరువబోతున్న ఆ స్టార్ హీరోయిన్..!!

murali krishna

నిజంగా నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు బాలయ్య నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద  భారీ రికార్డులను నెలకొల్పాయి.

సినిమా టాక్ అటూ ఇటూ ఉన్నా కానీ నటన పరంగా బాలయ్యను ఏనాడు  కూడా విమర్శించే స్థాయి కి ఆయన అస్సలు నటించలేదు . రీసెంట్గా విడుదల అయిన వీరసింహారెడ్డి సినిమా లో కూడా నందమూరి బాలయ్య ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చాడో అందరికి తెలిసిందే.

ఏకంగా మొదటి రోజు ఈ సినిమా 54 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీలో సంచలన రికార్డు అయితే నెలకొల్పింది . ప్రస్తుతం బాలయ్య - డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా లో హీరోయిన్గా ప్రియాంక జవాల్కర్ ఫిక్స్ అయిన్నట్లు సోషల్ మీడియా లో వార్తలు కూడా వినిపిస్తున్నాయి . అంతేకాదు శ్రీ లీల -బాలకృష్ణకు కూతురుగా ఈ సినిమాలో నటిస్తుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడట అనిల్ రావిపూడి .

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే - బాలయ్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అనిల్ రావిపూడి తో ఇప్పటికే ఉన్న తన ఫ్రెండ్షిప్ కారణంగా పూజా హెగ్డే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ సమాచారం.. మాస్ హీరో బాలయ్య తో హాట్ బ్యూటీ పూజా హెగ్డే జత కడితే కచ్చితంగా ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు కూడా నందమూరి అభిమానులు చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి బాలయ్య పక్కన పూజ హెగ్డే ఏ రేంజ్ లో స్టెప్స్ వేస్తుందో చూడాలి మరీ.బాలయ్ తో పూజా డాన్స్ చేస్తే ఆ సాంగ్ అదిరి పోతుంది అని అభిమానులు ఆత్రుత తో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: