బ్రహ్మాజీ ని అందుకే హీరోని చేశాను : కృష్ణవంశీ

murali krishna
టాలీవుడ్‌లో ఉన్న గొప్ప దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. గులాబీ, నిన్నే పెళ్లాడత మరియు సింధూరం, అంత:పురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ లాంటి కల్ట్, క్లాసిక్ సినిమాలను ఆయన అందించారు.

ఆయన ఒక క్రియేటీవ్ డైరెక్టర్. పాత్రలను ఎంతో అందంగా అద్భుతంగా చెక్కుతారు. కాగా డైరెక్టర్ కాకముందు కృష్ణవంశీ.. ఆర్జీవీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారటా.. ఇప్పడంటే పర్లేదు కానీ.. ఒకప్పుడు కష్టాలు  బాగా ఉండేవి . రోజుకు ఒక్క పూట అన్నం దొరికిందంటే ఆ పూట పండగే. చెప్పులు అరిగేలా ఆఫీసులు చుట్టూ తిరిగేతే కానీ ఎప్పటికో కానీ అవకాశాలు దక్కేవి కాదు. అలానే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అవ్వకముందు కృష్ణవంశీ ఆకలి బాధలు బాగా అనుభవించారట. ఆ సందర్భాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా వివరించారు కృష్ణవంశీ.

“అప్పటికీ భోజనం చేసి 5 రోజులు అవుతుంది.. కళ్లు బాగా మూతలు పడిపోతున్నాయి. ఇంకొక్క 5 నిమిషాలు అయితే పడిపోయే పరిస్థితి కృష్ణవంశీది.సరిగ్గా ఆ సమయంలో బ్రహ్మజీ వచ్చాడు. భోజనం చేద్దాం రా అని అన్నాడు. మాములుగా అయితే నేను ఎవరికీ కూడా రుణపడను. ఎవరైనా అలా రమ్మని అడిగినా వెంటనే వద్దు అని అనేవాడిని. కానీ ఆకలి అలా చేసింది. అది బలహీన క్షణం. ఆ రోజు బ్రహ్మజీ పెట్టించిన ఫుడ్ తింటూ అనుకున్న.. ఏమిస్తే ఇతడి రుణం తీర్చుకోలను అని. ఆపై నేను డైరెక్టర్‌ అయ్యాక సింధూరం లో బ్రహ్మజీని హీరోగా పెట్టడానికి అది కూడా ఒక కారణం అని ఆయన చెప్పుకొచ్చారు.. అందుకే హీరోని చేశాను” అని కృష్ణవంశీ వెల్లడించారట.

కాగా కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ చిత్రం..ఇప్పుడు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని.. తుది మెరుగులు దిద్దుకుంటుందని సమాచారం.రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ మరియు బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ వంటి వారు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: