బ్లూ కలర్ డ్రెస్ లో నడుమందాలతో మైమరపిస్తున్న సదా..!

Pulgam Srinivas
నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన జయం మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న ముద్దుగుమ్మ సదా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సదా ఆ తర్వాత ఎన్నో తెలుగు మూవీలలో అవకాశాలను దక్కించుకొని ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగింది.  

సదా కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అనేక తమిళ మూవీలలో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఈటీవీ లో ప్రసారం అవుతున్న డీ డాన్స్ షో కు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. ఇది ఇలా ఉంటే సదా కొన్ని సినిమాల్లో తన అందచందాలను కూడా ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
 

ఇలా సినిమాల్లో తన అందచందాలను ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఆరబోస్తూ ఉండే విధంగా ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా సదా అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. సదా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: