తన భార్య గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్..!!

murali krishna
టాలీవుడ్ లో ని స్వీట్ కపుల్స్ లో మహేష్ బాబు నమ్రత జోడీ కూడా ఒకటి. నమ్రత పుట్టినరోజు సందర్భంగా మహేష్ ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నమ్రత శిరోద్కర్ ఘట్టమనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని మహేష్ ఎమోషనల్ పోస్ట్ ను చేశారు. కుటుంబంను నమ్రత చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని మహేష్ వెల్లడించారు. నా ఎదుగుదలకు నమ్రత సహాయం చేస్తోందని మహేష్ తెలిపారు.

నమ్రత నా వెన్నంటే ఉన్నందుకు థ్యాంక్స్ అని మహేష్ బాబు కామెంట్లు కూడా చేశారు. టాలీవుడ్ మోస్ట్ లవింగ్ కపుల్ గా మహేష్ నమ్రత వార్తల్లో నిలవడం విశేషం. ఈరోజు నమ్రత పుట్టినరోజు కావడంతో నమ్రత ఫ్యాన్స్ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు ను తెలియజేస్తున్నారు. మహేష్ చేసిన కామెంట్ కు కేవలం రెండు గంటల్లోనే 30,000 కంటే ఎక్కువ మొత్తం లైక్స్ రావడం విశేషం.

2005 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన మహేష్ నమ్రతల పెళ్లి జరగగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జోడీ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు అయితే రాలేదు. సినిమాలతో మహేష్ బాబు ఎంతో బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా మహేష్ ఎంతగానో ప్రాధాన్యత ను అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ షూట్ లో పాల్గొంటున్న మహేష్ ఆరు నెలల్లో ఈ సినిమా షూట్ ను పూర్తి చేయాలని షరతు విధించారని సమాచారం.

గతంలో బిజినెస్ మేన్ సినిమా షూటింగ్ ను కూడా మహేష్ ఇదే విధంగా వేగంగా పూర్తి చేశారని సమాచారం . మహేష్ సినిమాలలో నమ్రత నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నా ఆ కోరిక నెరవేరే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. మహేష్ నమ్రత ఎంతోమందికి ఆదర్శంగా అయితే నిలుస్తున్నారు. మహేష్ నమ్రత ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఫ్యాన్స్ కు బాగా చేరువ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: