"వారసు" మూవీ "ఓటిటి" విడుదల ఎప్పుడంటే..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో అయినటువంటి దళపతి విజయ్ తాజాగా వారిసు అనే క్రేజీ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన విజయ్ సరసన హీరోయిన్ గా నటించగా , వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడి గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఈ సినిమాలో విజయ్ కి సోదరుడి పాత్రలో నటించాడు.

ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ కు తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తమిళ్ వర్షన్ ను జనవరి 11 వ తేదీన విడుదల చేయగా , తెలుగు వర్షన్ ను జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమాను వారసుడు పేరుతో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు వర్షన్ లకు ప్రేక్షకుల నుండి మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ "ఓ టి టి" విడుదల తేదీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు , ఈ మూవీ ని ఫిబ్రవరి 10 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: