10 రోజుల్లో వీర సింహారెడ్డి మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ లో శృతి హాసన్ , హనీ రోజ్ హీరోయిన్లుగా నటించగా , దునియా విజయ్ , వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ బ్యానర్ వారు నిర్మించారు. ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


నైజాం ఏరియాలో ఈ మూవీ కి 16.26 కలెక్షన్ లు దక్కగా ,  సీడెడ్ లో 15.70 కోట్లు , యూఏ లో 7.14 కోట్లు , ఈస్ట్ లో 5.37 కోట్లు , వెస్ట్ లో 4.03 కోట్లు , గుంటూరు లో 6.18 కోట్లు , కృష్ణ లో 4.48 కోట్లు ,  నెల్లూరు లో 2.79 కోట్లు ,  కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.64 కోట్లు ,  ఓవర్సీస్ లో 5.65 కోట్లు. మొత్తంగా 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 72.24 కోట్ల షేర్ , 121.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 74 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 1.76 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: