"వాల్తేరు వీరయ్య" కి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించగా ,  అందులో ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. ఆ తర్వాత చిరంజీవి "గాడ్ ఫాదర్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో చిరంజీవి లుక్స్ , స్టైల్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ ని సాధించ లేక పోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించిన వాల్తేరు వీరయ్య అనే క్రేజీ మూవీ లో హీరో గా నటించాడు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్ , బాబి సింహ ఈ మూవీ లో విలన్ పాత్రలలో నటించగా ,  రవితేజ , కేథరిన్ ఈ మూవీ లో ఇతర ముఖ్యvపాత్రలలో నటించారు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ టాక్ లభించింది.

దానితో ఇప్పటికీ కూడా ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 9 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88.37 కోట్ల షేర్ , 142.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. అలాగే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో 106.72 కోట్ల షేర్ , 182.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: