తమన్నాతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన విజయ్ వర్మ?

praveen
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్న గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అని చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ తన హవా నడిపిస్తుంది. ఇప్పటికే జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

 టాలీవుడ్ లోకి హ్యాపీడేస్ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే గత కొంతకాలం నుంచి తన సినిమాలతో కాకుండా ఏకంగా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక విషయంతో వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోతుంది తమన్నా భాటియా. మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ఎప్పుడు అని అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న సమయంలో ఏకంగా ఒక బాలీవుడ్ నటుడుతో తమన్న ప్రేమాయణం నడుపుతుంది అంటూ ఒక వార్త తెరమీదకి వచ్చి సోషల్ మీడియాని ఊపేస్తుంది అని చెప్పాలి. ఆ బాలీవుడ్ నటుడు ఎవరో కాదు నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో విలన్ పాత్రలో నటించిన విజయ్ వర్మ.

 న్యూ ఇయర్ సందర్భంగా  ఇద్దరు  గోవాలో సెలబ్రేషన్స్ చేసుకోవడం... ఇక తమన్న విజయ్ వర్మకు ముద్దు పెట్టిన వీడియో వైరల్ కావడం.. ఇక ఆ తర్వాత ముంబై ఎయిర్ పోర్టులో  ఇద్దరు కలిసి దర్శనమివ్వడం..  ఒక అవార్డు ఫంక్షన్లో కూడా ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం చూసి నిజంగానే వీరు రిలేషన్ లో ఉన్నారని అందరు నమ్మారు. అయితే ఇటీవల ఈ వార్తలపై విజయ్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.. తమన్నాతో తనకి ఎటువంటి రిలేషన్ లేదని మేమిద్దరం డేటింగ్ చేస్తున్నామంటూ వస్తున్న వార్తలు నిజం కాదు అంటూ చెప్పుకొచ్చాడు.. మేము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ తెలిపాడు. ఇక తమన్నాను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు విజయ్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: