మరో క్రేజీ మూవీతో వస్తున్న మంచు మనోజ్..!

Divya
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈయనపై కొంతమంది సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు అంటూ వార్తలు సృష్టించారు భూమా మౌనిక రెడ్డికి దగ్గర అవడంతో మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ కూడా వార్తలు బాగా వినిపించాయి. అయితే ఈ వార్తలు అన్ని అవాస్తవం అని తెలిపేలా మంచు మనోజ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. నిజానికి మంచు మనోజ్ చివరిసారిగా ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
2017లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత రెండు సినిమాలలో అతిధి పాత్రలో నటించిన ఈయన ఆ తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు. అలా దాదాపు 5 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని చెప్పాలి. ఇకపోతే తాజాగా మరొక కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి వాట్ ద ఫిష్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. అంతేకాదు ఈ టైటిల్ కి "మనం మనం బరంపురం" అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. అందులో చుట్టూ గ్యాంగ్స్టర్స్ ఉంటే మధ్యలో మంచు మనోజ్ ఉన్న దృశ్యాన్ని మనం చూడవచ్చు..
అంతేకాదు ఈ పోస్టర్లో "ఏ ఫిలిం బై వి "అని కూడా ఉంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే ఈ క్రేజీ టైటిల్ తో ప్రేక్షకులలో భారీ బజ్ కలిగేలా చేస్తున్నారు. ఈ సినిమాతోపాటు పాన్ ఇండియా మూవీ " అహం బ్రహ్మస్మి " సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీ మీకు ఖచ్చితంగా క్రేజీ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది అంటూ మనోజ్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: