వాల్తేరు వీరయ్యకి లాభాలు.. చిరు ఖాతాలో ఆ రికార్డ్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజా రవితేజ  కీలక పాత్రలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీని విడుదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమా విడుదలై వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తయింది. మొత్తం మీద ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల షేర్ వసూలు చేయగా 160 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా అలాగే యూ ఎస్ లో కూడా ఈ సినిమా సూపర్ రికార్డుని అందుకుంది. అక్కడ ఈ సినిమా ఏకంగా 2 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది. మెగాస్టార్ ఖాతాలో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహరెడ్ట్ తరువాత 2మిలియన్ డాలర్లు వసూలు చేసిన 3 వ సినిమాగా ఈ సినిమా నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.అయితే ఈ సినిమాకి ముందు విడుదల అయిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా కూడా పెద్దగా వసూళ్లు తీసుకురాకపోయింది.గాడ్ ఫాదర్ సినిమా టోటల్ గా 53.10 కోట్ల షేర్ 96.35 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఎందుకో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపించలేదు. అందుకే సినిమా వసూళ్ల మీద భారీగా ఎఫెక్ట్ పడింది..  దీంతో వాల్తేరు వీరయ్య సినిమాని కూడా లైట్ తీసుకున్నారు జనాలు.కానీ ఈ సినిమా అందరి అంచనాలను దాటేసి మరీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యి ఈ సినిమా దాదాపు 7 కోట్ల దాకా లాభాలను తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: