ఇలియానా మళ్ళీ బిజీ కాబోతుందా...?

murali krishna
తెలుగు ఆడియన్స్ కు ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అయితే అవసరం లేదు.. టాలీవుడ్ హీరోయిన్స్ లో మొదటి కోటి రూపాయల రెమ్యూనరేషన్ దక్కించుకున్న హీరోయిన్ గా ఎప్పటికి ఇలియానా నిలిచి పోతుంది అనడంలో సందేహం అయితే లేదు

హీరోయిన్ గా ఇలియానా  జోరు ఒకానొక సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ను కూడా ఆమె ఆశ్చర్యరపర్చింది. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి కాస్త ఇబ్బందిగా కష్టంగా అయితే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె రీ ఎంట్రీ కోసం తీవ్రంగా అయితే ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిన సమయంలో కూడా టాలీవుడ్ లో రీ ఎంట్రీకి ఆమె ఆసక్తి మాత్రం చూపించలేదు. అక్కడ పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగితేనే టాలీవుడ్ లో ఆఫర్ల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తుంది.

ఇలియానా ఇటీవల ఒక తెలుగు సినిమా కు కమిట్ అయ్యిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ ఒక సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం జరిగిందని.. చాలా రోజుల తర్వాత ఇలియానా ఒక తెలుగు సినిమా చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. ఆ మధ్య రవితేజ కు జోడీగా ఈమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా నిరాశ పర్చింది. అందుకే ఈ సినిమా అయినా ఆమెను మళ్లీ తెలుగు లో బిజీ చేస్తుందేమో అని చూడాలి మరి.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఇలియానా యొక్క తెలుగు సినిమా విశేషాలు అతి త్వరలోనే వెళ్లడి అయ్యే అవకాశం అయితే ఉంది. ఇలియానా యొక్క బాలీవుడ్ కెరీర్ ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేదు. అందుకే ఇటు వైపు ఈ గోవా బ్యూటీ చూస్తోందటా.తరువాత రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇలియానా కనుక మళ్లీ టాలీవుడ్ లో బాగా బిజీ అయితే కచ్చితంగా అధ్బుతం అంటూ కామెంట్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తుంది.03:32 PM

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: