త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతున్న జబర్దస్త్ జంట..!?

Anilkumar
జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కమెడియన్గా తన సత్తా చాటుకున్న రాకేష్ అదే షోలో తన స్కిట్లలో పాల్గొన్న సుజాతతో ప్రేమలో పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా రాకేష్ మరియు సుజాతల పెళ్లిని వారి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నారట. అయితే ఈ నెల చివర్లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఉంటుంది అని ఈ శుభవార్త ని పంచుకుంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు రాకేష్ మరియు సుజాత. 

ఇక ఆ వీడియోలో భాగంగా ఈ విషయాలని చెప్పుకొచ్చారు.. తమ ప్రేమ పెళ్లి ప్రకటనను కూడా ఇలా యూట్యూబ్ వీడియో చేసి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ జంట త్వరలోనే ఒకటి కాబోతుంది.ఇక వీడియో లో భాగంగా విరో మాట్లాడుతూ..ఎట్టకేలకు పెద్దలు అందరూ కలిసి మాకు పెళ్లి నిశ్చయించారని.. అంతేకాదు ఈ నెల చివరిలో నిశ్చితార్థం కూడా ఉంటుందని.. ఆరోజే దీనికి సంబంధించిన పత్రిక కూడా రాసుకుంటాము అంటూ చెప్పుకొచ్చింది సుజాత. తమ ప్రేమ వ్యవహారాలపై సోషల్ మీడియా వేదికగా వచ్చే రకరకాల ప్రశ్నలకు ఇదే సమాధానం అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు మంచి భర్త రావాలని మంచి కుటుంబం రావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది తను ఆశించినట్టుగానే తనకి మంచి భర్త మంచి కుటుంబాన్ని ఆ దేవుడి తనకి ఇచ్చాడు అంటూ ఆ వీడియోలో భాగంగా పేర్కొంది సుజాత. ఇందులో భాగంగానే రాకేష్ మాట్లాడుతూ.. సుజాత చాలా అల్లరి పిల్ల అది అందరికీ తెలుసు.. సాధారణంగా సుజాతకి బయట వాళ్లతో ఎలా మాట్లాడాలి అన్నది తెలియదు.. కానీ ఇప్పుడిప్పుడే తనకు అన్నీ తెలుస్తున్నాయి.. త్వరలోనే తామిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాము.. అంటూ వెల్లడించాడు రాకేష్. అయితే మొత్తానికి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త విన్నవిరి అభిమానులు సంతోషిస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: