జనవరిలో ముగింపు ట్విస్ట్ ఇవ్వబోతోంది ఎవరు ?

Seetha Sailaja
సంక్రాంతి టాప్ సీనియర్ హీరోల వార్ లో చిరంజీవి బాలకృష్ణ పై అంతిమ విజయం సాధించడంతో సంక్రాంతి రేస్ విజేతగా చిరంజీవి మారడంతో మెగా ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. ‘వీరసింహారెడ్డి’ బయ్యర్లకు నష్టాలు రానప్పటికీ చెప్పుకోతగ్గ లాభాలు ఉండకపోవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. ఇప్పుడు భారీ సినిమాల జాతర అయిపోవడంతో ఇక రానున్న రెండు మూడు నెలలలో మీడియం రేంజ్ చిన్న సినిమాల మధ్య పోటీ జరగబోతోంది.

ఈనేపధ్యంలో ఈనెలాఖరున రిపబ్లిక్ డేని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న రెండు చిన్న సినిమాల పై ఇండస్ట్రీ వర్గాలు చాల ఆశక్తిని కనపరుస్తున్నాయి. యంగ్ హీరో సుధీర్ బాబు మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నప్పటికీ అతడికి ఇప్పటి వరకు ఒక సరైన హిట్ రాకపోవడంతో అతడి కెరియర్ సాఫీగా నడవడం లేదు. ప్రస్తుతం ఈహీరో నటిస్తున్న ‘హంట్’ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈమూవీలో ఏదో ఒక విషయం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి.

మళయాళంలో విడుదలై మంచి ఫలితం అందుకున్న ముంబాయి పోలీసు మూవీకి రీ మెక్ గా ఈమూవీని మన తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీ పై సుధీర్ బాబు చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈమూవీతో పాటు ఇదే రిపబ్లిక్ డేని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న మరొక చిన్న సినిమా ‘బుట్టబొమ్మ’ మళయాళం సినిమా ‘కపిల’ కు రీమేక్ గా వస్తున్న ఈమూవీని ఇప్పటికే చాలామంది ఓటీటీ లో చూసి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఈమూవీ కూడ ఊహించని విధంగా హిట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా క్రియేషన్స్ ఈమూవీని నిర్మిస్తూ ఉండటంతో ఈమూవీ పై కూడ అంచనాలు బాగానే ఉన్నాయి. రిపబ్లిక్ డే సమయానికి సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా ముగిసిపోతుంది కాబట్టి ఈ రెండు సినిమాలలో ఎదో ఒకటి హిట్ అయ్యే అవకాశం ఉంది అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: