"ప్రేమిస్తే" భరత్ కు ఈ సినిమా బ్రేక్ ఇస్తుందా ?

VAMSI
బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో భరత్ గురించి తెలిసిందే.. ఈ సినిమా కమర్సియల్ గా హిట్ అయినా భరత్ తగిన గుర్తింపు అయితే రాలేదు అని చెప్పాలి. ఆ తరువాత వరుసగా ప్రేమిస్తే, యువసేన లాంటి సినిమాలతో అటు తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ స్పీడు చూసి ఇతను స్టార్ హీరో స్థాయికి వెళుతాడు అని తెలుగు తమిళ ఇండస్ట్రీలు భావించాయి. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా చెప్పుకోదగిన పేరు అయితే తెచ్చిపెట్టలేకపోయాయి. ఇలా కనుమరుగైపోయిన నటులు మళ్ళీ రాణించడం కష్టమే.. కానీ కెరీర్ లో రెండవ ఛాన్స్ లాగా ఇప్పుడు భరత్ కు కూడా ఒక సువర్ణావకాశం వచ్చింది.
వి ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం "హంట్" గన్స్ డోంట్ లై అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను మహేష్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బామ్మర్ది సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా , అతనికి సపోర్టింగ్ రోల్ లో భరత్ ఒక మంచి పోలీస్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు హంట్ సినిమాను రిపబ్లిక్ డే రోజును పురస్కరించుకుని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. కాగా తమిళ హీరో భరత్ దాదాపు పదేళ్లకుపైగా అయింది తెలుగులో సినిమా చేసి, ఇప్పుడు ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఇందులో యాక్షన్, సెంటిమెంట్, , క్రైమ్, థ్రిల్లర్, ఎమోషన్ మరియు ఫ్రెండ్షిప్ లాంటి అన్ని అంశాలు కలబోసిన చిత్రమే హంట్ అని చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉంది. మరి ఈ సినిమా భరత్ కు తెలుగులో బ్రేక్ ను ఇస్తుందా అన్నది చూడాలి.        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: