"యూఎస్ఏ" లో ఆ 3 మూవీలతో 2 మిలియన్ కలెక్షన్లను అందుకున్న చిరంజీవి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా తన కెరియర్ను ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడు. మధ్యలో కొంత కాలం పాటు చిరంజీవి రాజకీయాలపై దృష్టి పెట్టి సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి ... వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుండి చిరంజీవి వరుస మూవీలలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి తన కెరియర్లో ఇప్పటివరకు 3 మూవీలతో యుఎస్ఏ లో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను అందుకున్నాడు. ఆ మూడు మూవీలు ఏవో తెలుసుకుందాం.
చిరంజీవి చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీతో చిరంజీవి మొట్ట మొదటి సారి యుఎస్ఏ లో 2 మిలియన్ డాలర్ కలెక్షన్లను అందుకున్నాడు. ఈ సినిమాకు వి వి వినాయక్ దర్శకత్వం వహించగా ,  కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది.
చిరంజీవి ... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో రెండవ సారి యూఎస్ఏ లో 2 మిలియన్ డాలర్ కలెక్షన్లను అందుకున్నాడు. ఈ సినిమాలో నయనతార ... తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్లుగా నటించారు.
చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తాజాగా యూఎస్ఏ లో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా ఇప్పటికీ కూడా అద్భుతమైన రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: