రష్మిక కెరియర్ క్లోజ్.. ప్రూఫ్ ఇదేనట?

praveen
చలో సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ సంపాదించింది అని చెప్పాలి   ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంది. అంతేకాదు నేషనల్ క్రష్ అంటూ తన అందం అభినయానికి ఒక ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ కూడా సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ తో నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది రష్మిక.

 ఈ క్రమంలోనే సౌత్ లో సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ నార్తులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. దీంతో ఇక రష్మిక కెరియర్ కు తిరుగులేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు రష్మిక కెరియర్ డేంజర్ జోన్ లో పడిందా అంటే అవునని అంటున్నారు ఎంతోమంది ప్రేక్షకులు. ఎందుకంటే ఇటీవల కాలంలో సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఏకంగా కన్నడ చిత్ర పరిశ్రమకే వన్నేగా నిలిచిన కాంతార సినిమా చూడలేదు అంటూ రష్మిక కామెంట్స్ చేయడంతో అడ్డంగా ఇరుక్కుపోయింది.

ఈ క్రమంలోనే కన్నడ ప్రేక్షకులు అందరూ కూడా రష్మికపై తీవ్ర స్థాయిల విమర్శలు గుప్పించారు అని చెప్పాలి.  ఒకరకంగా కన్నడిగుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి అని చెప్పాలి. దీంతో కన్నడలో రష్మికను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసేంతవరకు వెళ్ళింది వ్యవహారం. ఇకపోతే రష్మిక  ఇటీవల విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా తమిళంలో తప్ప మిగతా భాషల్లో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా కన్నడలో ఈ మూవీనీ వందల థియేటర్లో ఎత్తేసారట. రష్మికపై ఏర్పడ్డ నెగిటివిటీ.. మరోవైపు యావరేజ్ టాక్ లాంటి కారణాలతో ఇక వారిసు రెండో రోజుకే దాదాపు 300 షోలు క్యాన్సల్ చేసుకున్నట్లు టాక్. దీంతో రష్మిక కెరీర్ ముగిసింది అంటూ ఒక ప్రచారం ఊపందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: