గందరగోళం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్.. ఏమైందంటే..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి... ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో సినిమాలు విడుదల చేయకపోయినప్పటికీ మొత్తం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్.. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా వేగంగా పావులు కదుపుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొంచెం గందరగోళం సృష్టిస్తున్నాడని చెప్పాలి. నిజానికి తాను నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు తన మేనల్లుడు సాయి ధరంతేజ్ నటిస్తున్న సినిమాలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్న ఈయన నెక్స్ట్ వారం నుంచి షూటింగ్లో పాల్గొనబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా?అని అభిమానులు ఎదురు చూస్తుండగానే ఒక సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయకుండానే మరో సినిమా షూటింగ్ సెట్లోకి వెళ్ళిపోతున్నాడు. మరొకవైపు తాను స్థాపించిన జనసేన పార్టీని ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలని సాయశక్తుల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే పర్యటన కోసం ప్రత్యేకంగా వారాహి వెహికల్ ను కూడా ఏర్పాటు చేయించారు. నిన్నటి నుంచి తెలంగాణలో రథయాత్ర మొదలుపెట్టేశారు పవన్ కళ్యాణ్.
ఒకవైపు సినిమాలు పూర్తి చేయలేదు.. మరొకవైపు పర్యటన కూడా అంతంతమాత్రంగానే సాగుతోంది.  ఇలాంటి సమయంలో అసంపూర్తిగా పనులు ఎందుకు చేస్తున్నారు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక వర్గం అభిమానులు పవన్ కళ్యాణ్ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఆయన నుంచి సినిమాలు వస్తాయని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  కానీ ఆయన నుంచి ఒక సినిమా కూడా రాలేదు దాంతో ఆయన పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూ సరిపెట్టుకుంటున్నారు అభిమానులు. ఇంకొకవైపు ఎన్నికల కోసం బస్సు యాత్రను కూడా మొదలుపెట్టేశారు. మరి ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ఆయన ఎలా బయటకి వస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: