చనిపోయేంత వరకు మనల్ని కాపాడేది అదే.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అని సమస్యతో  బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే.చాలా కాలం తర్వాత శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో ఇటీవల కనిపించింది సమంత. చాలా డిఫరెంట్ గా కనిపించింది.ఇందులో భాగంగానే చాలామంది నెటిజన్లో మునుపటిలా సామ్ లేదు అంటూ తన అందం తగ్గిపోయింది అని చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు.ఇందులో భాగంగానే తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కు గట్టి కౌంటర్లను ఇచ్చింది సమంత.

 తాజాగా ఇప్పుడిప్పుడే మాయోసైటీస్ వ్యాధి నుండి కోలుకుంటున్న సమంత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది. దీంతో పాటు సినిమాలపైనే కాకుండా తన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది సమంత. గత కొన్ని రోజులుగా తనకి సంబంధించిన కొన్ని పోస్టులు మరియు మరికొన్ని ఆసక్తికరమైన పోస్టులను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పెంచుకుంటుంది సమంత. తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును షేర్ చేస్తుంది. తాజాగా ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగానే సమంత ఎవరైనా ఒక సమయంలోనే ఆశలను కోల్పోతారు వారికి ఇది స్ఫూర్తినిస్తుందనుకుంటున్నాను ఇది ఎప్పటికీ ముగియదు ఒకవేళ ముగిసే వరకు కూడా ఆశలు ముగియవు అంటూ ఒక కోట్ ని షేర్ చేసింది సమంత. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ మనల్ని కాపాడేది ఆశ మాత్రమే అని ఈ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది సమంత. ఇక సమంత పెట్టిన ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా తన సోషల్ మీడియా వేదికగా తన మజిల్స్ చూపిస్తూ ఒక కొత్త ఫోటోని షేర్ చేసింది సమంత. జూమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఒక ఫోటోను తన అభిమానులతో పంచుకుంది .ఆమె ఫిట్నెస్ ట్రేైనర్ ఈ ఫోటోని తీసినట్లుగా కనిపిస్తోంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: