ఎటువంటి మార్పు లేదు.. ధనుష్ మూవీ రిలీజ్ పక్కా..!

Divya
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడే. ఈయన తమిళంలో తెరకెక్కించే ప్రతి సినిమాని కూడా తెలుగులో రిలీజ్ చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల తిరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్ ఇప్పుడు ఒక తెలుగు చిత్రం చేస్తున్నాడు అదే సార్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ , పాటలు అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.
అంతేకాదు తిరు సినిమా ఫలితం కూడా ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచుతోంది.  ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఇకపోతే ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయాలని డేట్ లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు  సమంత శాకుంతలం సినిమాతో పాటు ఆంటమాన్ 2 కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో సార్ సినిమాను వాయిదా వేసే అవకాశం ఉంది అని పలువురు పలు రకాలుగా కామెంట్లు చేశారు.  కానీ ఎట్టకేలకు ఈ సినిమా విడుదల డేట్ పై ఎటువంటి మార్పు లేదు అని ఖచ్చితంగా ఫిబ్రవరి 17వ తేదీన ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది అని చిత్ర బృందం స్పష్టం చేసింది.
ఇకపోతే ఈ సినిమాను తమిళంలో వాతి పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది.  ప్రముఖ నిర్మాత సూర్యదేవరనాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ కూడా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: