"సార్" మూవీ నుండి రెండవ సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుల్లో ఒకరు అయినటువంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ధనుష్ తన కెరీర్ లో రఘువరన్ బీటెక్ ... మారి ... తిరు మరియు కొన్ని సినిమాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇలా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకున్న ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సార్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన థియేటర్ లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషలో విడుదల చేయనున్నారు.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ఒక పాటను విడుదల చేయగా , ఆ పాటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఏ సినిమా నుండి రెండవ సాంగ్ అయినటువంటి "బంజారా" అనే సాంగ్ ను ఈ సంవత్సరం జనవరి 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ కి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: