ఫ్యాన్ డైరెక్టర్ గా మారితే.. రిజల్ట్ ఇలాగే ఉంటుంది?

praveen
రైటర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత డైరెక్టర్గా అవతారమెత్తి ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు యంగ్ డైరెక్టర్ బాబి . మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. రవితేజ కీలక పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అటు వాల్తేరు వీరయ్య పేరు మారుమోగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మెగా ఫాన్స్ అందరు కూడా ఎన్నో ఏళ్ల నుంచి బాస్ ను ఎలా చూడాలి అని అనుకుంటున్నారో ఇక అలాగే చూపించాడు బాబి.

 దీంతో ఇక మెగాస్టార్ చెప్పినట్లుగానే థియేటర్లలో పూనకాలు లోడింగ్ అనేలా థియేటర్ దద్దరిల్లిపోతుంది అని చెప్పాలి. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలోని ప్రతి సీను కూడా ప్రేక్షకుడిని ఎంతగానో కట్టిపడేస్తుంది అని చెప్పాలి.  ఇక ఈ సినిమాలో రవితేజ చిరంజీవి మధ్య జరిగే సీక్వెన్స్ అయితే ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసేసాడు. ఇకపోతే ఇటీవల వాల్తేరు వీరయ్య చిత్రబృందం సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక ఈ సినిమాకు దర్శకుడుగా ఉన్న బాబీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బాబి రైటర్ గా కెరియర్ మొదలుపెట్టి డైరెక్టర్ గా మారాడు అన్న విషయం తెలుసు. కానీ కేవలం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసినందుకే బాబి డైరెక్టర్ అయ్యారు అన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. చిరంజీవికి తాను హార్డ్ కోర్ ఫ్యాన్ అని ఎప్పుడు చెబుతూ ఉంటాడు బాబీ. ఇక వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో చిరు బాబీని ముద్దు పెట్టుకున్న ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మెగాస్టార్ అభిమాని దర్శకుడిగా మారి అదే మెగాస్టార్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్య నిదర్శనం అంటూ ఎంతోమంది ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: