స్వయంగా చిరంజీవి మెసేజ్ చేస్తే.. ఆ యాంకర్ పట్టించుకోలేదట తెలుసా?

praveen
మెగాస్టార్ చిరంజీవి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేదానికి ఈయన చిరునామాగా ఉంటారు అని చెప్పాలి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన టాలెంట్ తో మెగాస్టార్ గా మారిపోయాడు. ఇండస్ట్రీలో కొత్త ట్రెండు సృష్టించాడు. ఇప్పుడు వరకు 150 కి పైగా సినిమాల్లో నటించిన ఆయన ఇప్పటికీ 60 ఏళ్ల వయసులో యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు అని చెప్పాలి..ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ క్రేజ్  గురించి ఎంత చెప్పినా తక్కువే అనడంలో అతిశయోక్తి లేదు.

 ఇక అలాంటిది అభిమానులు అందరూ చిరంజీవిని ఒక్కసారి కలిసిన కూడా చాలు అని అనుకుంటూ ఉంటారు. ఇక చిరంజీవిని కలిసి అవకాశం వస్తే ఈ జన్మకు ఇది చాలు అని తరించిపోతూ ఉంటారు అని చెప్పాలి. అలాంటిది ఇక పుట్టినరోజు నాడు ఏకంగా చిరంజీవి లాంటి వ్యక్తి నుంచి బర్త్ డే విషెస్ చెబుతూ మెసేజ్ వస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. కానీ ఇక్కడ టాలీవుడ్ యాంకర్ మాత్రం చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే అస్సలు పట్టించుకోలేదట. ఇక ఈ విషయాన్ని ఒక టాక్ షోలో తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

 ఇంతకీ ఆ యాంకర్ ఎవరో కాదు తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న యాంకర్ సుమ. ఇటీవల చిరంజీవి యాంకర్ సుమ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న సుమ అడ్డా అనే కార్యక్రమానికి వచ్చారు. మూడు నాలుగు సంవత్సరాల నుంచి హ్యాపీ బర్త్ డే సుమ గాడ్ బ్లెస్స్ యు, స్టే బ్లెస్స్డ్ లాంటి మెసేజ్లు నీకు పెడుతున్నాను. కానీ నువ్వు కనీసం రిప్లై కూడా పెట్టలేదు. చిరంజీవి స్వయంగా మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఏకైక వ్యక్తి నువ్వే అంటూ చిరంజీవి చెప్పాడు. దీంతో షాక్ అయిన సుమ.. సార్ నిజంగా మీ నెంబర్ నాకు తెలియదు. ఎవరో మెసేజ్ చేశారని చూడలేదేమో.. మీరు మెసేజ్ చేస్తారని కూడా ఊహించలేదు అంటూ సారీ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: