మరోసారి ప్రియుడితో అలా దొరికిపోయిన తమన్నా?

Purushottham Vinay
గత కొన్ని రోజులుగా తమన్నా లవ్ ఎఫైర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ వర్మతో మిల్కీబ్యూటీ ప్రేమలో ఉందని వార్తలు నెట్టింటా తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి.ఎందుకంటే ఇటీవల న్యూయర్ సెల్రబ్రెషన్స్‏ను వీరిద్దరు గోవాలో గ్రాండ్ గా జరుపుకున్నారు.ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి.. ఇంకా అంతేకాకుండా.. అక్కడ విజయ్ వర్మకు తమన్నా ముద్దుపెడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. దీంతో వీరిద్దరు రిలేషన్‏లో ఉన్నారంటూ బీటౌన్‏లో టాక్ పరిగెడుతుంది . అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అటు మిల్కీ బ్యూటీ తమన్నా గానీ.. ఇటు విజయ్ వర్మగానీ ఇంకా స్పందించలేదు. ఇక తాజాగా మరోసారి వీరిద్దరు కెమెరాకు దొరికారు.ఇక ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ఓ అవార్డ్ షోకు సంబంధించిన వీడియోలో తమన్నా ఇంకా విజయ్ వర్మ కనిపించారు.


వీరిద్దరూ కలిసి ఆ వేడుకలో పాల్గొన్నట్లు ఆ వీడియో చూస్తే అర్దమవుతుంది. దీంతో మిల్కీబ్యూటీ అభిమానులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఇక వీరు ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ తేల్చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో వీరు ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోటోలకు బాగా ఫోజులిచ్చారు.ఇక తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అలాగే లస్ట్ స్టోరీస్ 2 సినిమాలో కూడా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో విజయ్ వర్మ కూడా నటిస్తున్నారు.ఈ సినిమాతో వీరిద్దరు మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే వీరిద్దరూ ఇలా కలిసి పార్టీలకు ఇంకా వేడుకలకు అటెండ్ కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో గతేడాది సింగర్ దిల్జిత్ దోసాంజ్ ముంబైలో ఇచ్చిన ప్రదర్శనలో కూడా పాల్గోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: