సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం..?

Divya
గడిచిన కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ దిగ్గజ నటులలో సూపర్ స్టార్ కృష్ణ ,కృష్ణంరాజు ,చలపతిరావు, కైకాల సత్యనారాయణ మరణ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు అభిమానులు సినీ ప్రేక్షకులు. అయితే ఈ వార్త మరువకముందే ఇప్పుడు తాజాగా మరొక తీవ్ర విషాదం నెలకొంది. తమిళ, తెలుగు భాషలలో ఎన్నో చిత్రాలకు రచయితగా వ్యవహరించిన ప్రముఖ కళా రచయిత బాలమురగన్ ఆదివారం రోజున పలు అనారోగ్య సమస్యలతో మరణించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈయన మరణించే సమయానికి ఈయన వయసు 86 సంవత్సరాలు.

ఇక ఈయన కుమారుడు తెలిపిన ప్రకారం వృద్ధాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా తన కుమారుడు భూపతి రాజా తెలియజేయడం జరిగింది. దీంతో బాలమురగన్ మృతి పట్ల పలువురు తెలుగు, తమిళ్ సినీ ప్రముఖుల సైతం సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన రాసిన కథలలో ఆలుమగలు సోగ్గాడు, జీవన తరంగాలు, ధర్మదాత తదితర చిత్రాలు కూడా సూపర్ హిట్టుగా నిలిచాయి. ముఖ్యంగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన మొదటి చిత్రం బంట్రోతు భార్యకి అనే సినిమాకి కూడా ఈయన కదా అందించినట్లు తెలుస్తోంది. ఇక శోభన్ బాబు నటించిన సోగ్గాడు సినిమా టాలీవుడ్ లోనే అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా కల్ట్ స్టేటస్ను కొనసాగిస్తోందని చెప్పవచ్చు.

ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథలను అందించిన ఈయన మరణ వార్త విని ఆయన అభిమానులు సినీ ప్రముఖుల సైతం తీవ్రమైన దిగ్బ్రాంతికి గురవుతున్నారు. బాలమురుగన్ తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కూడా కథలు అందించారు. కేవలం నటుడు శివాజీ గణేషన్ కింగ్ దాదాపుగా 30 సినిమాలకు పైగా కథలు అందించినట్లుగా సమాచారం. దీంతో తమిళ సినీ ప్రేక్షకులు సినీ ప్రముఖుల సైతం ఈ రచయిత మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈయన మరణ వార్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: