గెటప్ శ్రీను తగ్గేదేలే.. హీరోయిన్ కు లిప్ లాక్ పెట్టేసాడుగా?

praveen
జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న గెటప్ శ్రీను ఇక కేవలం జబర్దస్త్ తోనే తన కెరీర్ను ఆపేయకుండా సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ తన అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో అవకాశాలు దక్కించుకుంటున్న గెటప్ శీను ఒకవైపు తాను కూడా హీరోగా మారి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమం లోనే రాజు యాదవ్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా లో నటించాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో అంకిత కారత్ హీరోయిన్గా నటిస్తుంది. కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా అప్డేట్ గురించి గత కొంత కాలంగా అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్భం గా రాజు యాదవ్ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ చూసుకుంటే బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇచ్చారు అన్నది తెలుస్తుంది

 ఇప్పుడు వరకు ఎవ్వరు కని విని ఎరుగని సరికొత్త కాన్సెప్ట్ తో ఇక గెటప్ శీను ప్రేక్షకులను పలకరించ  బోతున్నాడు అన్నది ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇటీవల కాలం  లో స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల సినిమాలు వరకు ప్రతి సినిమా లో కూడా హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు.. లిప్ లాక్ సన్నివేశాలు సర్వసాధారణం  గా మారి పోయాయి. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన టీజర్ లో గెటప్ శ్రీను కూడా సైతం హీరోయిన్ తో లిప్ లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సమ్మర్ లో విడుదలచేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: