వీరసింహారెడ్డి సహా.. రాజీవ్ కనకాల ఎన్ని సినిమాల్లో చనిపోయే పాత్ర చేశాడంటే?

praveen
ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంతోమంది ఇక ఎన్నో సినిమాల్లో పాత్రలతో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటున్నారు. ఇక అలాంటివారు ఎంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో రాజీవ్ కనకాల కూడా ఒకరు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎంతమంది స్టార్ హీరోలు సినిమాల్లో కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు ఆయన.

కాగా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎప్పుడు ఒకే తరహా పాత్రులు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక రాజీవ్ కనకాల కెరియర్ లో కూడా ఇలా ఒకే తరహా పాత్రలు చాలానే ఉన్నాయి. ఏకంగా సినిమాలో రాజీవ్ కనకాల నటించే పాత్ర చనిపోతుంది. ఇక ఆయన చనిపోవడం సినిమాలో కథను మలుపు తిప్పుతుంది.. ఇక ఇలాంటి పాత్రలు చాలానే చేశారు రాజీవ్ కనకాల. ఇటీవలే వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలోని ఇలాంటి పాత్ర చేశాడు. రాజీవ్ కనకాల తన కెరీర్ లో ఇలా పాత్ర చనిపోయే రోల్ ఎన్నిసార్లు చేశాడు అనేది హార్ట్ టాపిక్ గా మారిపోయింది.

 ఆయన నటించిన దాదాపు 14 సినిమాల్లో కూడా ఇలా చనిపోయే పాత్రలో నటించారట. హరికృష్ణ ప్రధాన పాత్రలో  నటించిన స్వామి సినిమాలో రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటిస్తాడు. అయితే ఈ సినిమాలో ఈ పాత్ర చనిపోతుంది. ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన అశోక్ సినిమాలో కూడా రాజీవ్ కనకాల ఎన్టీఆర్ స్నేహితుడిగా కనిపించగా విలన్ల చేతిలో  దారుణ హత్యకు గురవుతాడు. రాజు గారి గది 2 సినిమాలో కూడా రాజీవ్ కనకాల హీరో అన్నయ్య పాత్రలో కనిపించగా చివరికి దారుణ హత్యకు గురవుతాడు. ఇక ఏ ఫిలిం బై అరవింద్ సినిమాలో సైతం రాజీవ్ కనకాల నెగటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో నటించి చివరికి కన్నుమూస్తాడు. మహేష్ బాబు అతడు సినిమాలో కూడా పార్ధు అనే పాత్రలో నటించి చనిపోతాడు. దీంతో అక్కడితో సినిమా మలుపు తిరుగుతుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన హరే రామ్, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతిధి, దూకుడు, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్, రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లవర్, రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం, కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసారా సినిమాల్లో ఇక పాత్ర చనిపోయే రోల్ చేశాడు రాజీవ్ కనకాల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: