అందం, ఆరోగ్యం పొందాలంటే..తప్పకుండా బొప్పాయి జ్యూస్ తాగాల్సిందే..

Divya
అందం మరియు ఆరోగ్యం ఒకే పండు జ్యూస్ లో దొరుకుతాయి అంటే ఎవరు వదులుతారు చెప్పండి.ఈ బొప్పాయి అన్ని సీజన్లలో విరివిగా దొరుకుతుంది. అంతేకాక సామాన్య మానవుడు కూడా కొనగలిగే విధంగా, తక్కువ ధరకే లభిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ బొప్పాయిని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల,శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కళంగా అందుతాయి. ఈ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకుంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం..
బొప్పాయి జ్యూస్ తయారు చేసే విధానం..
బాగా పండిన ఒక బొప్పాయి తీసుకొని ముక్కలుగా చేసి మీక్సీ జార్ లో వేసుకోవాలి.అందులో ఒక స్ఫూన్ తేనే, అర స్ఫూన్ జీలకర్ర పొడి,రెండు నానబెట్టిన బాదాం గింజలు మరియు తగినన్ని పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిని ఒక గ్లాస్ లో వేసి సర్వ్ చేసుకోవచ్చు. కావాలంటే ఐస్ ముక్కలను యాడ్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ను టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత తీసుకోవడం చాలా ఉత్తమం.
ఈ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
బొప్పాయి పండులో తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక ఫైబ‌ర్ లు ఉంటాయి. వీటితో పాటు విట‌మిన్ ఎ, సి, ఇ క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫ్లోటేట్, పాంథోనిక్ యాసిడ్ వంటి న్యూట్రియాంట్స్ పుష్కళంగా లభిస్తాయి.
ఈ పండును త‌ర‌చూ తీసుకోవ‌డం వల్ల, ఇందులోని  క్యాల్షియం ఎముకలను దృఢంగా తయారుచేస్తుంది. ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో సహాయపడుతుంది.దీనిని తాగడం వల్ల, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.కావున అధికబరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చాలాబాగా ఉపయోగపడుతుంది.దీనిని డెంగ్యూపీవర్ వచ్చిన వారికి ఇవ్వడం వల్ల, వారి రక్తంలో తగ్గిన బ్లడ్ ప్లేట్ లెట్స్ పెంచడంలో సహాయ పడుతుంది.
ఇందులో లభించే విటమిన సి శరీరంలోని రక్త ప్రసరణ పెంచి, ముఖము అందంగా, మంచి కలర్ వచ్చేలా చేస్తుంది. మరియు వృద్యాప్యఛాయాలను దూరం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: