సొంతం సినిమాలోని.. ఆ అందమైన హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే?

praveen
సాధారణంగా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ఇక ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ ఉంటారు. మొదటి సినిమాతో హిట్టు కొట్టడమే కాదు ఇక తర్వాత కాలంలో కూడా దర్శకుడు నిర్మాతల చూపును ఆకర్షించి వరుస అవకాశాలు అందుకుంటూ ఉంటారు. క్రమక్రమంగా స్టార్ హీరోయిన్లుగా మారి తమకు తిరుగులేదు అని నిరూపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఆ తర్వాత అదే స్టార్ డమ్ నిలబెట్టుకోలేకపోతుంటారు అన్న విషయం తెలిసిందే.
 ఇలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కేవలం ఒకటి రెండు సినిమాలతో మాత్రమే సరి పెట్టుకొని ఆ తర్వాత కనుమరుగైన హీరోలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నేహా కూడా ఒకరు. నేహా ఎవరు ఆమె హీరోయిన్గా నటించిందా అని ఈమె పేరు వినగానే అందరికీ డౌటు వస్తుంది. కానీ ఈమె నటించిన సినిమా గురించి చెబితే మాత్రం ఈమె అందం అభినయం నటనను అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఆర్యన్ రాజేష్, నమిత జంటగా నటించిన సొంతం సినిమాలో నేహా నటించింది. సునీల్ కి నేహాకు మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఒక్కసారిగా కట్టిపడేసింది నేహా. ఇక మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. గోల్మాల్, వీధి రౌడీ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలు పెద్దగా ఆమె కెరియర్ కు ఉపయోగపడలేదు. దీంతో మరాఠీ చిత్రాల్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ కొన్ని సినిమాలు చేసింది.  తర్వాత హిందీలోను బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటించింది. 2020 సంవత్సరంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత కూడా సీరియల్స్ చేస్తుంది నేహా. కాగా ఇటీవల ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: