'అలా వైకుంటపురంలో' రీమేక్.. ఆ మ్యాజిక్ మిస్ అయిందే?

praveen
ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో చేసి సూపర్ హిట్  అందుకోవాలని దర్శక నిర్మాతలు అందరూ కూడా భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ప్రతి ఇండస్ట్రీలో కూడా రిమేక్ సినిమాల హవా పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇతర భాషల సినిమాలను ఇక తమ భాషలో రీమేక్ చేస్తూ కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే రీమేక్ సినిమా అనేది కత్తి మీద సామ లాంటిది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అంతకుముందు సూపర్ హిట్ అయినా సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్ ని కూడా ఎక్కడ తగ్గకుండా ఇక రిమేక్ సినిమాలో కూడా చూపించాల్సి ఉంటుంది అని చెప్పాలి.

 అంత కష్టపడి సినిమా తీసిన తర్వాత ఆ సినిమా హిట్ అవుతుంది అన్నది కూడా గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురములో సినిమా ఎంత సూపర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే త్రివిక్రమ్ తన మార్క్ డైలాగులతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ నే బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నించారు అన్న విషయం తెలిసిందే. షహజాదా అనే పేరుతో రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్ అల్లు అర్జున్ స్థానంలో నటిస్తూ ఉన్నాడు.


 ఇందుకు సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. అంతా బాగానే ఉంది కానీ అలా వైకుంటపురంలో సినిమాలోని బంటు క్యారెక్టర్ లో కార్తీక్ ఆర్యన్ కాస్త సెట్ కాలేదు అని చెప్పాలి. అంతేకాదు ఇక అలా వైకుంఠపురంలో ఉన్న మ్యాజిక్ మొత్తం షహజాదాలో మిస్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాస్త రీమేక్ లో ఓవర్ మెడికల్ క్లాస్ ఫ్యామిలీ గా మారడం.. ఇక కామెడీ కాస్త క్రింగే కామెడీగా కనిపించడం జరిగింది.  ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం బాలీవుడ్ వాళ్లు తెలుగు సినిమాలను చేయడం ఆపేస్తేనే బెటర్ ఏమో అనే ఫీలింగ్ అందరిలో కలుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: