అందంగా రెడీ అయ్యి.. హార్పిక్ యాడ్ చేసింది.. ఆడుకుంటున్న నెటిజన్స్?

praveen
ఒకప్పుడు తీన్మార్ వార్తలతో తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా దగ్గరైన సావిత్రి ఇక తర్వాత బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన తర్వాత అందరికీ మరింత సుపరిచితురాలుగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది సావిత్రి అలియాస్ శివ జ్యోతి. ఇక ఇటీవల కాలంలో ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో కనిపిస్తూ తన తైన శైలిలోనే అలరిస్తుంది.  అయితే కెరియర్ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన శివ జ్యోతి ఇప్పుడు మాత్రం కాస్త గ్లామర్ షో పెంచేసింది అని కూడ గుసగుసలు వినిపిస్తున్నాయి.

 బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో ఛానల్ లో తీన్మార్ వార్తలు తరహా లోనే ఇక సరికొత్త న్యూస్ బులిటెన్ మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక ఎన్నో స్పెషల్ ఈవెంట్లలో కూడా పాల్గొని సందడి చేస్తూ ఉంది అని చెప్పాలి. తీన్మార్ వార్తలు చదివిన సమయంలో శివజ్యోతి అంటే అందరిలో ఎంతో రెస్పెక్ట్ ఉండేది. కానీ ఇటీవల కాలంలో గ్లామర్ షో చేస్తున్నడంతో ఆ రెస్పెక్ట్ కాస్త తగ్గుతూ వస్తుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇటీవల కాలంలో అయితే శివ జ్యోతి కి సంబంధించిన ఏదైనా వీడియో బయటికి వచ్చిందంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో ట్రోలర్స్ కి ఫుల్ మీల్స్ లాగా మారిపోతుంది అని చెప్పాలి.

 ఇప్పుడు ఇలాంటి వీడియోనే ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇటీవలే సావిత్రి అలియాస్ శివ జ్యోతి అడ్వర్టైజ్మెంట్ లు కూడా చేస్తూ ఉంది. ఇక తాజాగా ఒక యాడ్లో నటించింది. సంక్రాంతి సందర్భంగా ఈ యాడ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇందులో పట్టుచీర కట్టుకొని అందంగా రెడీ అయి సాంప్రదాయమైన దుస్తుల్లో కనిపించిన శివజ్యోతి చివరికి బాత్రూం క్లీన్ చేసే హార్పిక్ గురించి అడ్వర్టైజ్ ఇచ్చింది. ఇది చూసి ఎంతో మంది నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. అందంగా రెడీ అయ్యి హార్పిక్ యాడ్ చేస్తావా అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: