కళ్యాణం కమనీయం.. సంతోష్ శోభన్ గెలిచినట్టేనా..?

Divya
సంతోష్ శోభన్ హీరోగా.. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం కళ్యాణం కమనీయం.. ఈరోజు సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన నాలుగు బడా సినిమాల మధ్య విడుదలైన అతి చిన్న సినిమాగా రికార్డు సృష్టించింది.. కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ గా తెరికెక్కిన ఈ సినిమాను అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వం వహించారు. సప్తగిరి, దేవి ప్రసాద్ , సద్దాం, పవిత్ర లోకేష్ , సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ సంగీతం సమకూర్చిన ఈ సినిమా తాజాగా విడుదలవడంతో ప్రీమియర్ షో చూసిన అభిమానులు అభిప్రాయాలను ట్విట్టర్ రివ్యూ ద్వారా వెల్లడించారు.
సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. సంతోష్ శోభన్ తెలుగులో తనదైన ముద్ర వేసుకోవడానికి అలాగే బ్యాంకింగ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అతను ఎంచుకుంటున్న స్క్రిప్ లు మాత్రం పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం లేదు అని.. ఇది కూడా పెద్ద పురోగతి కోసం చూస్తున్న తనకి మరిన్ని సినిమాలలో పనిచేయడానికి దారి తీస్తోంది. కళ్యాణం కమనీయం సినిమా చాలా రొటీన్ గా మొదలై చివరి వరకు అసలు ఆసక్తి లేని సన్నివేశాలతో నీరసం తెప్పిస్తుంది.
సినిమా మొదటి భాగం కొన్ని కామెడీ సన్నివేశాలతో కొంచెం ఆసక్తికరంగా కనిపిస్తుంది.  కానీ ఆ తర్వాత సగం సినిమా పూర్తిగా ఎమోషనల్ గా మారుతుంది.  ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడంతో సన్నివేశాలు కూడా చాలా డ్రాప్ గా కనిపిస్తున్నాయి. హీరో తన పరిస్థితిని వర్ణించడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చాలా సింపుల్ కథ అంశంతో ఆసక్తి లేని సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తోందని అభిమానులు వెల్లడిస్తున్నారు.సంతోష్ శోభన్ నటన ప్రదర్శన విషయానికి వస్తే చాలా రెగ్యులర్ గా కనిపించాడు.  అది అతని మునుపటి సినిమాల ప్రదర్శనలు గుర్తుచేస్తున్నారటంలో సందేహం లేదు.  ఆయన ఇంకా మెరుగుపడాలి అంటే దర్శకులు తనకు ఏదైనా మంచి పాత్రను ఆఫర్ చేస్తే మాత్రమే ఆయనలోని నటన బయటకు వస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: