భయంకర జబ్బుతో బాధపడుతున్న శృతి?

Purushottham Vinay
 ప్రస్తుతం లో లీడింగ్ లో ఉన్న హాట్ బ్యూటీస్ లో  శ్రుతిహాసన్ కూడా ఒకరు. ప్రస్తుతం వరుస చిత్రాలతో చాలా స్పీడ్ గా దూసుకుపోతోంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం శృతి  హాసన్ నటించిన ల్లో వీరసింహారెడ్డి నిన్న (జనవరి 12)న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకోగా తాజాగా విడుదల అయిన వాళ్తేర్ వీరయ్య సినిమా కూడా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది.ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ఎంతగానో ఆకట్టుకుంది శ్రుతిహాసన్. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ చాలా భారీగా విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా శ్రుతిహాసన్ తనకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి చెప్పి అభిమానులకి గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ అనారోగ్య సమ్యసలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రుతి హాసన్ కూడా తనకు అనారోగ్య సమస్య ఉందని చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇక తాజాగా ఓ సందర్భంలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. తాను గత కొద్ది కాలం నుంచి మానసిక సమస్యతో బాధపడుతున్నానని తెలిపింది. అయితే తన మానసిక పరిస్థితి కోసం శృతి ఇప్పటికే చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మానసిక సమస్య వల్ల ఉన్నట్టుండి ఎక్కువగా ఆవేశపడటమే కాకుండా చాలా తొందరగా సహనం కోల్పోతున్నానని కూడా శృతి హాసన్ తెలిపింది.మొదట్లో ఈ సమస్య గురించి బయటకు చెప్పడానికి భయపడేదని అయితే ఈ సమస్యను దాచుకోవటం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని.. అందువల్లే బయటకు చెప్పేస్తున్నా అని తెలిపింది. ఇక ఈ సమస్య ఎక్కువైతే దాన్ని కంట్రోల్ చేయడానికి మ్యూజిక్ వింటా అని కూడా తెలిపింది. నేను అనుకున్నది అనుకున్నట్టు జరగక పోతే కోపం వెంటనే వచ్చేస్తుందని ఎలాగైనా ఈ సమస్యకు చికిత్స తీసుకుంటున్నా అని తెలిపింది శ్రుతి హాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: