అజిత్ Vs విజయ్: సంక్రాంతి విజేత ఎవరు?

Purushottham Vinay
ఇక సౌత్ మూవీ ఇండస్ట్రీలో సంక్రాంతి పోరు అనేది నువ్వా? నేనా? అన్నట్లు జరుగుతుంది. స్టార్‌ హీరోల మూవీస్ క్లాష్‌ అవుతుండడంతో ఎవరు సంక్రాంతి పండుగ విజేతగా నిలుస్తారనే ఉత్కంఠ అటు టాలీవుడ్‌లోనూ ఇంకా పొరుగు ఇండస్ట్రీ కోలీవుడ్‌లోనూ నెలకొంది.టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి సినిమా ఈరోజు చాలా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.  కలెక్షన్ల వర్షం కూడా కురిపించడం మొదలుపెట్టేసింది. అలాగే మరో సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా శుక్రవారం కూడా (జనవరి 13) బాక్సాఫీస్‌ బరిలోకి దిగనుంది. ఇక కోలీవుడ్ లో కూడా ఇప్పటికే సంక్రాంతి పందెం రంజుగా సాగుతోంది. అజిత్‌ కుమార్‌ నటించిన తునివు (తెలుగులో తెగింపు), అలాగే విజయ్‌ నటించిన వారీసు( తెలుగులో వారసుడు) బుధవారం నాడునే (జనవరి 11) చాలా గ్రాండ్‌గా రిలీజయ్యాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఒకే రోజున భారీగా విడుదలయ్యాయి. ఈ క్రమంలో రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అజిత్‌ ఇంకా విజయ్‌ పోటీలో ఎవరు విజయం సాధించారన్నాది దేశావ్యాప్తంగా కూడా చాలా ఆసక్తిగా మారింది.


ఇక తమిళనాడులో అజిత్‌  సినిమా తునివు మొదటిరోజు ఏకంగా పాతిక కోట్ల మేర కలెక్షన్స్‌ ని సాధించగలిగింది. ఇంకా విజయ్‌ నటించిన వారీసు సినిమా దాదాపుగా రూ.20 కోట్లదాకా వసూళ్లు సాధించినట్లు సమాచారం తెలుస్తోంది.అయితే తమిళనాడు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలు, ఓవర్ సీస్ వసూళ్లు కలుపుకుంటే వసూళ్ల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక తునివు సినిమా తెలుగులో విడుదల కాగా.. వారీసు తెలుగు వెర్షన్‌ ఇంకా రిలీజ్‌ కాలేదు. మొత్తానికైతే ఈ రెండు మూవీలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సంక్రాంతి విజేతగా నిలిచేందుకు ఎంతగానో పోటీపడుతున్నాయి. ఫస్ట్ డే ప్రకారం చూసినట్లయితే అజిత్ ఓపెనింగ్స్ బాగా రాబట్టాడని సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుస్తుంది. ఇక వారసుడు మూవీలో విజయ్‌, రష్మిక మందన జంటగా నటించగా, తెగింపు సినిమాలో అజిత్‌, మంజు వారియర్‌ కలిసి నటించారు. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ మాత్రం అజిత్ రాబట్టి ప్రస్తుతం సంక్రాంతి విజేతగా నిలిచాడు. కానీ ఇంకో వారం ఆగితే కానీ ఎవరి సత్తా ఏమిటో తెలీదు.మరి ఈ రెండు మూవీల్లో ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచిందో తెలియాలంటే ఖచ్చితంగా మరో వారం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: