దేవి శ్రీప్రసాద్ మాటలు దేనికిసంకేతం !

Seetha Sailaja
సినిమా రచయితలకు అదేవిధంగా సంగీత దర్శకులకు సృజనాత్మకత తగ్గిపోతోంది అంటూ అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి సాలూరి రాజేశ్వరరావు నిన్న మొన్నటి ఇళయరాజా నేటితరం ఏఆర్. రెహమాన్ కీరవాణి లాంటి ఎందరో క్రియేటివ్ సంగీత దర్శకులు సంగీతం సమకూర్చిన పాటలు దశాబ్దాల పాటు జనం గుర్తు పెట్టుకునేలా మిగిలిపోతుంటే నేటితరం క్రేజీ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ తమన్ లు స్వరపరిచిన పాటలు ఎక్కువకాలం నిలబడలేకపోవడమే కాకుండా అవి కాపీ ట్యూన్స్ గా మారుతున్నాయి అన్న విమర్శల పై దేవిశ్రీ ప్రసాద్ ఘాటైన సమాధానం ఇచ్చాడు.  

‘సంగీతం ఇన్ స్ట్రుమెంటులో ఉండదు మన గుండె కాయలో ఉంటది మన మనసులోంచి బయటికొస్తే సంగీతం’ అంటూ దేవీశ్రీ ప్రసాద్ ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురికావడం వెనుక కారణాలు ఏమై ఉంటాయి అంటూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. తనను కాపీ అండ్ పేస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అభి వర్ణిస్తూ కొందరు చేస్తున్న నెగిటివ్ ప్రచారానికి దేవిశ్రీ ప్రసాద్ హర్ట్ అయి ఇలాంటి సమాధానం ఇచ్చాడా అన్న సందేహాలు కూడ వస్తున్నాయి.

తాను ఈమధ్య గోవా వెళ్ళినప్పుడు కేవలం 250 రూపాయలతో కొన్న ఒక బూరతో చిరంజీవి రవితేజా లపై ఒక పాటను ట్యూన్ చేసాను అని చెపుతూ పాటను స్వర పరచడానికి ఖరీదైన ఇన్ స్ట్రీమెంట్స్ తో పాటు రోడ్డు పక్కన దొరికే చవకబారు సంగీత పరికరాలతో కూడ సంగీతాన్ని ట్యూన్ చేయవచ్చు అంటూ దేవిశ్రీ ప్రసాద్ అన్న మాటలు ఎవర్ని ఉద్దేశించినవి అంటూ కొందరు చర్చలు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేవిశ్రీ ప్రసాద్ కు తమన్ తో విపరీతమైన పోటీ ఏర్పడుతోంది.

దీనికితోడు తమన్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు కూడ రావడంతో దేవిశ్రీకి చాల గట్టిపోటీ ఏర్పడింది. ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించడానికి 3కోట్ల పారితోషికం తీసుకునే దేవిశ్రీ తన పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు అని అనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: