అల్లు శిరీష్ చేసిన పనికి.. తిట్టిపోస్తున్న జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్?

praveen
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన  త్రిబుల్ ఆర్ సినిమా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటేలా చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది త్రిబుల్ ఆర్ సినిమా. ఇక ఇప్పుడు అవార్డుల విషయంలో కూడా త్రిబుల్ ఆర్ తిరుగులేదు అని నిరూపిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే ఆ త్రిబుల్ ఆర్ సినిమా లో సూపర్ హిట్ సాంగ్ అయినా నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారం లభించింది. అయితే ఆసియా ఖండంలోనే ఈ అవార్డు పొందిన మొట్టమొదటి సినిమాగా త్రిబుల్ ఆర్ అరుదైన రికార్డు సృష్టించింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే  త్రిబుల్ ఆర్ సినిమాలో ఈ అద్భుతమైన గీతాన్ని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవానిపై ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు రావడం పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ త్రిబుల్ ఆర్ చిత్ర బృందానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రాజకీయ నాయకులు సైతం ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల అల్లు వారి హీరో శిరీష్ చేసిన పని కాస్త ప్రస్తుతం తీవ్ర విమర్శలకు తావు ఇస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా అల్లు శిరీష్ చేసిన పనికి అతని తిట్టిపోస్తూ ఉన్నారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. అందరిలాగానే సోషల్ మీడియాలో ఇక త్రిబుల్ ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రామ్ చరణ్ ల సోషల్ మీడియా హ్యాండిల్స్ ని అల్లు శిరీష్ ట్యాగ్ చేశాడు.  కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరును మాత్రం ట్యాగ్ చేయకపోవడం గమనార్హం. దీంతో శిరీష్ కావాలనే ఎన్టీఆర్ పేరును ట్యాగ్ చేయలేదు అంటూ ఎంతో మంది నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక అల్లు శిరీష్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ntt

సంబంధిత వార్తలు: