వీర సింహారెడ్డి సినిమా ఎలా ఉందంటే..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా డాన్స్ వేస్తూ అభిమానులను ఆనందపరిచేలా చేస్తూ ఉన్నారు. ఒకవైపు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోలో బాగా ఆకట్టుకుంటూనే.. మరొకవైపు వెండితెరపై కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేనే దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఈ చిత్రంలో బాలకృష్ణ మరొకసారి పెప్పర్ సాల్ట్ లుక్ లో హైలెట్గా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇంటర్వెల్ సీన్ చాలా ఎమోషనల్ గా ఉందని ఒకవేళ ఇదే ఓపులో రెండవ భాగం కూడా ఉంటే సినిమా మంచి సూపర్ హిట్ అయి ఉండేది అంటు కొంతమంది నెటిజన్లు తెలియచేస్తున్నారు. సెకండ్ హాఫ్ చాలా దారుణంగా ఉందని అందరూ కూడా బయటికి వెళ్లిపోతున్నారంటూ మరి కొంతమంది నెట్టుజనులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుత్వం పైన ఎన్నో కౌంటర్లు ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం టికెట్ల రేటు పెంపు అదనపు షోలుకు అనుమతించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారంటూ మరొక నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.


మరికొంతమంది బోయపాటి కన్నా అరాచకం బ్లాక్ బాస్టర్ సెకండా ఎంతో ఎమోషనల్ గా ఉంది అంటూ బాలయ్య ఏడిస్తే ఏమి ఎడ్చార్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అయినా సెకండ్ హాఫ్ కాస్త డిసప్పాయింట్ గాని ఉందంటూ మరొక నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఓవరాల్ గా అబౌట్ యావరేజ్ మూవీ గా బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే ఈ చిత్రం నచ్చుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. వీర సింహారెడ్డి సినిమాలోని డైలాగ్స్ ఊర మాస్ లెవల్లో ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: