మెగాస్టార్ కి అల్ ది బెస్ట్ చెప్పిన స్టార్ హీరో....!!

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమ లో సినిమాల పరంగా సంక్రాతి సంబరాలు నేటి నుండి మొదలు కానున్నాయి. అదికూడా బాలయ్య బాబు ఏంట్రీ తో 'వీర సింహారెడ్డి 'అనే పేరుతో. ఇటీవల జరిగిన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ శృతిహాసన్ పై బాలకృష్ణ చేసిన హాస్య స్ఫూర్తికరమైన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. శృతి హాసన్ అంటే తన రాక్షసి అంటూ బాలయ్య  బాబు కామెంట్ చేశారు. వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్ లో అంతర్భాగం గా  ఆయన ఈ రకమైన కామెంట్ చేశారు. అలాగే ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ప్రోగ్రాం లో కూడా ఆయన నయనతారను ఊర్వశి అని, శృతిహాసన్ ను రాక్షసి అని అన్నానని బాలయ్య బాబు అన్నారు.
ఐతే ఇదే సంగతి శృతిహాసన్ కు చెప్తే ఆమె నవ్విందంటూ కూడా బాలయ్య బాబు అన్నారు. ఐతే తనది మాత్రం రాక్షసగుణమని,అలాగే శృతి కూడా రాక్షసి అవ్వడంతో  ఇద్దరి మధ్య బాగా కెమిస్ట్రీ కుదిరింది అని బాలయ్య బాబు చెప్పుకొచ్చారు. ఇకపొతే ఫైనల్ గా శృతి చాలా మంచి నటి అని సభముఖం గా కొనిడారు.
ఐతే అక్కడే బాలయ్య ఇంకో ఇంట్రెస్ట్ కామెంట్స్ చేసారు. దాంట్లో భాగంగానే ఏ రంగంలోనైనా పోటీ అనే కచ్చితంగా ఉండాలన్నారు. ఆలా ఉంటేనే మనం ఎంటో, మనం ఎక్కడున్నామో తెలుస్తది అని అన్నారు. పోటీ అనేది ఉంటేనే చిత్ర పరిశ్రమలో  బాగుంటదని చెప్పుకొచ్చారు. ఐతే ఇవాళ రిలీజ్ అవ్వబోతున్న వీరసింహారెడ్డికి పోటీగా వస్తోన్న మరొక మూవీ మెగాస్టార్ చిరంజీవి చేసిన వాల్తేరు వీరయ్య మూవీ కి  బాలయ్య ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఐతే ఈ సందర్భంగా తనకు,చిరంజీవికి కచ్చితంగా పోటీ  ఉండాల్సిందేనని అన్నారు. ఐతే బాలయ్య బాబు మూవీ ని తెరకేక్కిస్తున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో   వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వబోతుంది.ఐతే ఇప్పటికే విడుదలైన మూవీ పాటలు, ట్రైలర్ మూవీ పై భారీస్థాయి లో ప్రేక్షకులు కి దగ్గరైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: