తునివు: ప్రాణాలు పోగొట్టుకున్న అజిత్ అభిమాని?

Purushottham Vinay
మిగతా దేశాల్లో ఏమో కానీ మన దేశంలో మాత్రం స్టార్ హీరోలకి అభిమానులు, వీరాభిమానులు ఇంకా డైహార్డ్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. ఇంకా వాళ్లకి ఫ్యాన్ క్లబ్స్ ఇంకా అసోసియేషన్స్ కూడా ఉంటాయి. సినిమా రిలీజ్ అయినప్పుడు తమ ఫేవరెట్ యాక్టర్ బర్త్‌డే రోజు సేవా కార్యక్రమాలు చేయడం లాంటివి మన ఫ్యాన్స్ సాధారణంగా చేస్తుంటారు.అయితే ఇంత వరకు బాగానే ఉంటుంది కానీ అభిమానం మాత్రం హద్దులు దాటితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విషయంలో తమిళ నాడు వాళ్లతో పోలిస్తే మన తెలుగు హీరోల ఫ్యాన్స్ కొంచెం పర్లేదనే చెప్పొచ్చు. కోలీవుడ్‌లో అయితే టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా దళపతి విజయ్, తల అజిత్ ఈ ఇద్దరూ టాప్ స్టార్స్ అంటే చచ్చిపోతారు. వీరి ఇద్దరికీ కూడా సమానంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా మార్కెట్ ఉంది.ఇక ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. సినిమాలు విడుదల అయినప్పుడు వాళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రతిరోజూ కూడా సోషల్ మీడియాలో వీళ్ల మధ్య దారణమైన మాటల యుద్ధాలు చాలా జరుగుతుంటాయి.


లేటెస్ట్ గా అజిత్ 'తునివు' (తెగింపు), విజయ్ 'వరిసు' (వారసుడు) సినిమాలు చాలా కాలం తరువాత ఒకేసారి సంక్రాంతి కానుకగా జనవరి 11న బాక్సాఫీస్ బరిలోకి దిగాయి..విజయ్ 'వారిసు' బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా.. అజిత్ 'తునివు' మాత్రం డిజాస్టర్ అంటున్నారు. తమిళనాట స్టార్ హీరోలైన అజిత్ - విజయ్ ఫ్యాన్స్ మిగతా హీరోల అభిమానుల కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు.ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా చాలా మొండిగా ప్రవర్తిస్తుంటారు.ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. మళ్ళీ ఇప్పుడు అత్యుత్సాహంతో అజిత్ అభిమాని ఒరు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని రోహిణి థియేటర్‌లో మిడ్ నైట్ 1 గంటకు వేస్తున్న 'తునివు' స్పెషల్ షో చూడ్డానికి భరత్ కుమార్ అనే ఓ అజిత్ అభిమాని వచ్చాడు. ఒక్క క్షణం ఆ వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటే చక్కగా సినిమా చూసి ఆనందంగా తిరిగి వెళ్లేవాడు కానీ అలా అవ్వలేదు.లారీలో వచ్చిన అతను థియేటర్ దగ్గరకు వస్తున్న ఆ లారీ ఆగకముందే కిందకి దూకేశాడు. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇక అజిత్ కుమార్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.హీరోపై అభిమానం ఉండొచ్చు కానీ ఇంత అత్యుత్సాహం మాత్రం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: