నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లొబ్ అవార్డ్ పై స్పందించిన మెగాస్టార్..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. అయితే ఈ నేపథ్యంలోని వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిరంజీవి.. త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి అవార్డు రావడంపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నిద్రలేయడంతోనే హుషారైన న్యూస్ తో నా రోజు మొదలైంది.. ఆ విషయం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం గర్వపడేలా గోల్డెన్ గ్లోబ్ అవార్డు 

త్రిబుల్ ఆర్ సినిమా కోసం కీరవాణి గారు కంపోస్ట్ చేసిన పాటకి రావడం అందరూ చాలా గర్వపడే విషయం.. వాళ్లందరికీ లేవగానే శుభాకాంక్షలు తెలిపాను.. ఇక ఇప్పుడు ఈ మీడియా సమావేశం ద్వారా మరోసారి వారందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను.. అంతేకాదు కీరవాణి గారికి రాజమౌళి గారికి దానయ్య గారికి గీతా రచయిత చంద్రబోస్ కి మరియు ఈ పాట పాడిన గాయకులకు.. అంతేకాదు ఈ పాటకు అద్భుతంగా నర్తించిన అనిపించిన ఎన్టీఆర్కి మరియు రామ్ చరణ్ కి నా అభినందనలు అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి.. ఇది మనందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్.. ముఖ్యంగా నాకు అని చెప్పుకొచ్చారు చిరంజీవి..

ఇందులో భాగంగానే విలేకరి మీ అబ్బాయి చిత్రానికి అవార్డు వచ్చి మీకు రాలేదు అని మీరు ఏమైనా అసంతృప్తితో ఉన్నారా... అని అడిగితే.. చిరంజీవి దానికి చిరునవ్వుతో బదిలిచ్చాడు.. నిజానికి ఈ క్షణం వరకు అవార్డు నాకే వచ్చినట్లు నేను చాలా సంతోషంగా ఉన్నాను.. మీరు ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడిగితే నిజమే కదా అని అనిపిస్తుంది.. వచ్చింది నాకు కాదు కదా అని అనిపిస్తుంది.. అయితే ఆ మధ్యలో కొందరు దర్శకులు నాకు కొన్ని కథలను వినిపించారు.. ఇక అవన్నీ కధలు కూడా స్టూడెంట్ స్టోరీస్ ఇక ఈ వయసులో నేను అలాంటి పాత్రలో నటిస్తే బాగోదు కదా అని ఆలోచిస్తున్నాను. సాధారణంగా ఏ సినిమాలో అయినా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే చరణ్ ఆ సినిమా చేస్తాడు అంటూ చాలా సరదాగా నవ్వుతూ బదులిచ్చాడు మెగాస్టార్ చిరంజీవి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: