మేకింగ్ వీడియో : డూప్ లేకుండానే.. సుధీర్ బాబు ఎంత రిస్క్ చేశాడు?

praveen
మహేష్ బాబు బావగా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ బాబు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. డాన్సుల్లో యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించి అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక అంతేకాదు కథల ఎంపికలో కూడా ఆచితూచి  అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి. దీంతో సుధీర్ బాబు సినిమా వస్తుందంటే చాలు అందులో ఏదో ఒకటి కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు అని చెప్పాలి.

అయితే ప్రస్తుతం మరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు సుదీర్ బాబు. హంట్ అనే సినిమాతో జనవరి 26వ తేదీన ప్రేక్షకులను పరికరించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పాలి.  యాక్షన్ త్రిల్లర్ కథాంశంతో తలకెక్కిన ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బృందం బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన మేకింగ్ వీడియో ని ఇటీవల చిత్ర బంధం సోషల్ మీడియాలో విడుదల చేసింది.

 సాధారణంగా సినిమాల్లో ఇక ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరోలు తమకు డూప్ ద్వారా మాత్రమే ఈ సన్నివేశాలను పూర్తి చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఇక ఈ సినిమాలో మాత్రం సుదీర్ బాబు స్వయంగా రంగంలోకి దిగి ఎలాంటి డూప్ లేకుండానే యాక్షన్ సీక్వెన్స్ చేశాడు అన్నది ఈ మేకింగ్ వీడియోలో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోలో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలోని రిస్కీ ఫైట్ సీన్లను డూప్ లేకుండానే తీసినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎలాంటి రోప్ బెడ్ లాంటివి లేకుండానే ఫైట్స్ చేసాం అంటూ తెలిపాడు. జ్ఞాపకశక్తి  కోల్పోయాక కోల్పోక ముందు అనే విధంగానే తన పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: