అమెరికాలో బాలయ్య సినిమా క్రేజ్ మాములుగా లేదుగా...!!

murali krishna
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ రాబోతుంది.. అంతా సంక్రాంతి పండుగలో విడుదల కాబోయే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.. మరి సంక్రాంతికి ఈసారి భారీ పోటీ అయితే నెలకొన్నదని చెప్పవచ్చు.
టాలీవుడ్ నుండి రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ''వీరసింహారెడ్డి'' సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. క్రాక్ వంటి సినిమాతో మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత ఏకంగా బాలయ్య తోనే సినిమా ను చేసాడు.. ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపబోతున్నాడని తెలుస్తుంది... బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్  సినిమా గా 'వీరసింహారెడ్డి' కోసం అభిమానులు బాగా ఎదురు చూస్తున్నారు.
భారీ అంచనాలు మధ్య ఉన్న ఈ సినిమా విడుదల దగ్గర అవుతుండగా యూఎస్ మార్కెట్ లో అయితే మంచి మాసివ్ రెస్పాన్స్ తో దూసుకు వెళ్తుంది.. లేటెస్ట్ గా అక్కడ వీరసింహారెడ్డి సినిమా ఏకంగా 4 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసిందని సమాచారం... ప్రీమియర్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేస్తుండగా ఒక డే 1 నాటికీ మరింత రెస్పాన్స్ అందుకునే అవకాశం కూడా ఉంది.. మరి మొదటిసారి ఓవర్సీస్ లో కూడా బాలయ్య ఈ రేంజ్ లో దూసుకు వెళ్లడం నందమూరి అభిమానులకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే వరుస పాటలు విడుదల చేస్తూనే ఉన్నారు. అలాగే తాజాగా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. ఇక మరొక వారం రోజుల్లోనే విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో మంచి ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయం అని ట్రేడ్ పండితులు కూడా గట్టిగ చెబుతున్నారు. జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమా చిరు సినిమాకు ఎటువంటి పోటీ ఇస్తుందో ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: