రష్మీకని తన అమ్మానాన్న ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం తెలుగు ,తమిళం, హిందీ భాషల్లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ తో  కలిసి నటిస్తున్న వారసుడు సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక తమిళంలో ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది కన్నడ భామ రష్మిక మందన. తెలుగు తమిళం హిందీ భాషల్లోనే కాకుండా ప్రస్తుతం ఈమె బాలీవుడ్ హీరో అయినా సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోంది .

ఇక ఈ సినిమా జనవరి 24 న విడుదల కానుంది.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అటువైపు ఆ సినిమాలకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది రష్మిక మందన. అయితే ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్స్ తో కలిసి చిట్ చాట్ చేసింది రష్మిక మందన. అయితే ఇంట్లో తనను రష్మిక మందన అమ్మానాన్న ఏమని పిలుస్తారో ఈ క్రమంలోనే చెప్పుకొచ్చింది రష్మిక..అయితే రష్మిక అమ్మానాన్న రష్మిక ని ఆమె ఇంట్లో ఉన్నప్పుడు మౌని అని లేదా మొవ్వ అని పిలుస్తారు అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. అయితే తనని పిలుస్తున్న ఈ పేర్ల అర్థం ఏంటి అని చాలామంది వారి సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఈ పేర్ల అర్థం కొడవ భాషలో కూతురు అని... దీంతో చాలామంది తన ఫాలోవర్లలో ఉన్న సీనియర్ నేటిజన్స్ ఈ సీక్రెట్ పేరుతో పిలిచిన పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ అంటున్నారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేషనల్ ఫ్రెష్ రష్మిక మందన ప్రస్తుతం ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న పుష్ప టు సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. అంతేకాకుండా త్వరలోనే రష్మిక మందన ఈ షూటింగ్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీంతో రష్మిక అమ్మానాన్న తనని ఏమని పిలుస్తారు అన్న విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: